మెగా హీరో వరుణ్ తేజ్ గత రాత్రి హీరోయిన్ లావణ్య త్రిపాఠికి ఉంగరం తోడికి నిశ్చితార్ధం చేసుకున్నాడు. 2016 నుండి ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యింది. గత రాత్రి నాగబాబు ఇంట్లో జరిగిన ఈ నిశ్చితార్ధానికి కేవలం మెగా-అల్లు ఫామిలీస్ మాత్రం హాజరవగా.. వారు వరుణ్ తేజ్-లావణ్యలతో కలిసి ఉన్న ఫొటోస్ కోసం మెగా ఫాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. అందులోను పవన్ కళ్యాణ్ ఎంట్రీపై అందరిలో ఉత్సుకత కనిపించింది. అయితే వరుణ్ ఎంగేజ్మెంట్ ఫొటోస్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.
అందులో చిరు-సురేఖల ఎంట్రీ.. వరుణ్ తేజ్-లావణ్యలని ఆశీర్వదించిన పిక్స్ ముందు బయటకి రాగా.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తన అన్న నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కోసం స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చారు. భార్య పిల్లలని తీసుకురాకపోయినా.. పవన్ సింగిల్ గానే అదరగొట్టేసారు. లావణ్య త్రిపాఠికి వరుణ్ తేజ్ కి పుష్ప గుచ్చాలతో విష్ చేసారు. నాగబాబు-వదినమ్మలతో పవన్ ఫొటోలకి ఫోజులిచ్చారు. ఆ గ్రూప్ పిక్ లో నిహారిక కూడా ఉంది.
ఇక పవన్ కళ్యాణ్ వరుణ్ ఎంగేజ్మెంట్ లో సందడి చేయడం, వరుణ్ తేజ్ తో ముచ్చట్లు పెట్టిన పిక్స్, రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన తో కలిసి వరుణ్ నిశ్చితార్ధానికి హాజరైన పిక్స్ అన్ని వైరల్ గా మారాయి.