Advertisement
Google Ads BL

టీజర్: అడవి బిడ్డ.. నేలకొండ భగవంత్ కేసరి


నటసింహం నందమూరి బాలకృష్ణ బర్త్‌డే‌ని పురస్కరించుకుని ఫ్యాన్స్‌కి మాస్ ట్రీట్ వచ్చేసింది. ఆయన హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ‘భగవంత్ కేసరి’ టీజర్‌ని మేకర్స్ వదిలారు. ఈ టీజర్ ఇప్పుడు రికార్డులను ఊచకోత కోస్తూ దూసుకెళుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టైటిల్ లుక్, ఫస్ట్ లుక్ ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకోగా.. ఈ టీజర్‌తో నిజంగా ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. మరోసారి థమన్ తాండవమాడేశాడు. బాలయ్య సినిమా అనగానే ముందు థమన్‌కి పూనకాలు వస్తాయనుకుంటా.. ఏం తాగి కొడుతున్నాడో కానీ.. ఇప్పటి నుంచే థియేటర్లకు ఊపిరి పీల్చుకోండి అనేలా.. ఈ టీజర్‌కి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో సిగ్నల్స్ పంపించాడు. 

Advertisement
CJ Advs

టీజర్ విషయానికి వస్తే.. ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా బాలయ్యను అనిల్ రావిపూడి ఇందులో ప్రజెంట్ చేశాడు. ‘రాజు.. ఆని ఎనకున్న వందలమంది మందను చూయిస్తడు, మొండోడు.. వాడికున్న ఒకే ఒక్క గుండెను చూయిస్తడు’ అని బాలయ్య చెప్పే పవర్ ఫుల్ డైలాగ్‌తో.. ముందు విలన్‌ని పరిచయం చేస్తూ టీజర్ మొదలైంది. ఆ వెంటనే ఓ యాక్షన్ ఎపిసోడ్‌తో బాలయ్య లుక్‌ని రివీల్ చేశారు. ‘రెండు చెవుల మధ్య బ్రెయిన్ ఎందుకు ఉంటుందో తెలుసా?.. ఎందుకంటే చెవులు అర్థం చేసుకోలేని పదాలను నేరుగా మొదడులోకి వెళతాయి కాబట్టి’.. అంటూ ‘అడవి బిడ్డ.. నేలకొండ భగవంత్ కేసరి’ అని బాలయ్య తనని తాను విలన్స్‌కి పరిచయం చేసే డైలాగ్ పవర్‌ఫుల్‌‌గా ఉంది. ‘ఈ పేరు చానా యేళ్లు యాదుంటది’ అని బాలయ్య చిరునవ్వుతో టీజర్ ఎండ్ అవుతుందని అనుకున్నారు.. కానీ రెట్రో మ్యూజిక్‌తో టీజర్‌ని ఎండ్ చేసిన తీరు.. సరికొత్తగా అనిపిస్తుంది. మొత్తంగా చూస్తే బాలయ్య లుక్, డైలాగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఇలా ప్రతి ఒక్కటీ హైలెట్ అనేలా ఉంది. 

బాలయ్య 108వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. టాలీవుడ్ క్రష్ శ్రీలీల ఓ కీలక పాత్రలో కనిపించనుంది. బాలయ్య, శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు హృదయానికి హత్తుకునేలా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఇందులో విలన్‌గా నటిస్తున్నారు. మొత్తానికి చూస్తే.. ఈ బర్త్‌డే‌కి బాలయ్య ఫ్యాన్స్‌కి కావాల్సిన ట్రీట్ అయితే ఈ సినిమా ఇచ్చేసింది. టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్.. వరసబెట్టి వదులుతూ.. ఫ్యాన్స్‌ కళ్లల్లో ఆనందానికి అనిల్ కారణమయ్యాడు. ఇక ఈ టీజర్ కొన్ని రోజుల పాటు వారి మైండ్‌లో నుంచి పోయేలా లేదు అంటే.. ఇక ట్రైలర్, సినిమా ఏ రేంజ్‌లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. దసరా బరిలోకి ‘భగవంత్ కేసరి’ని దింపేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

NBK Starring Bhagavanth Kesari Teaser Talk:

Natasimham Balakrishna Birthday Special Bhagavanth Kesari Teaser Out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs