Advertisement
Google Ads BL

ఒకేసారి బాలయ్య ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్స్


నేడు నందమూరి నటసింహం బర్త్‌డే. బాలకృష్ణ బర్త్‌డే అంటే నందమూరి ఫాన్స్‌కి పండగే. ఆయన కటౌట్స్ పెట్టి పాలాభిషేకాలు, కేక్ కట్ చేయడాలు అబ్బో హడావిడి జాతరని తలపిస్తుంది. ఆయన బర్త్‌డేని పురస్కరించుకుని.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న భగవంత్ కేసరి నుండి టీజర్ వదలబోతున్నారు. ఒకరోజు ముందే టైటిల్ రివీల్ చేసి.. బర్త్ డే రోజున టీజర్ ప్లాన్ చేశారు. ఉదయం 10:19 నిమిషాలకి భగవంత్ కేసరి టీజర్ వదులుతున్నారు.

Advertisement
CJ Advs

అదే సమయానికి దర్శకుడు బాబీతో బాలయ్య కొత్త చిత్రం అంటే NBK109 పూజా కార్యక్రమాలతో మొదలు కాబోతుంది. అటు పవర్ ఫుల్ టీజర్ ఇటు కొత్త సినిమా ఓపెనింగ్ ఒకేసారి జరగడం నందమూరి ఫాన్స్‌కి డబుల్ ట్రీట్ కాక ఇంకేముంటుంది. వాల్తేర్ వీరయ్య సక్సెస్ తర్వాత దర్శకుడు బాబీ బాలయ్యకి కథ చెప్పి కమిట్ చేయించి.. ఆయన పుట్టిన రోజునాడే సినిమాని మొదలుపెట్టేస్తున్నాడు.

ఇక ఈ రెండు ట్రీట్స్ మాత్రమే కాకుండా.. బాలయ్య బర్త్‌డే కి అఖండ 2 పై అప్‌డేట్ వస్తుందని బాలయ్య ఫాన్స్ ఆశపడినా.. అది కాస్తా పోస్ట్‌పోన్ అయ్యింది. ప్రస్తుతం భగవంత్ కేసరి టీజర్, కొత్త సినిమా పూజతోనే సరిపెట్టుకోవాలి. మరి ఈ రెండు అప్‌డేట్స్‌తో బాలయ్యని సోషల్ మీడియాలో నందమూరి ఫాన్స్ ట్రెండ్ చెయ్యడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Balayya Birthday.. Double Treat to Fans:

Balayya Bday: Bhagavanth Kesari Teaser and Movie Opening with Baby
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs