Advertisement
Google Ads BL

ఎన్టీఆర్-చరణ్ పై హాలీవుడ్ క్రిస్ హెమ్స్ కామెంట్స్


ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్స్ గా మారడమే కాదు.. హాలీవుడ్ సెలబ్రిటీస్ నుండి రామ్ చరణ్-ఎన్టీఆర్ ఇంకా రాజమౌళి ప్రసంశలు పొందుతున్నారు. ఆర్.ఆర్.ఆర్ విడుదలై ఏడాది పైన అయినా.. ఆ మాయ నుండి ఇప్పట్లో బయటపడేలా కనిపించడం లేదు. ఇంకా ఇంకా ఆర్.ఆర్.ఆర్ ని పొగిడేవారు కనిపిస్తూనే ఉన్నారు. అందులో హాలీవుడ్ దిగ్గజాలు పొగుడుతుంటే ఆ హ్యాపినెస్ ఇంకెందులోను దొరకదు. ఆస్కార్ తో తెలుగోడి సత్తా చాటిన రాజమౌళిని ఎంతగా ప్రశంసిస్తున్నారో అంతకన్నా ఎక్కువుగానే చరణ్-ఎన్టీఆర్ నటనని పొగుడుతున్నారు. 

Advertisement
CJ Advs

తాజాగా ఆర్.ఆర్.ఆర్ లో నటించిన ఎన్టీఆర్-రామ్ చరణ్ పై హాలీవుడ్ హాలీవుడ్ దిగ్గజం క్రిస్ హెమ్స్ వర్త్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆర్.ఆర్.ఆర్ సినిమాను ఈమధ్యనే చూశా. ఆర్.ఆర్.ఆర్ అద్భుతంగా అనిపించింది. నమ్మలేకుండా ఉంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరి నటన అద్భుతం. ఒకవేళ చరణ్-ఎన్టీఆర్ తో కలసి నటించే అదృష్టం లభిస్తే అది అద్భుతమే అంటూ చేసిన కామెంట్స్ కి చరణ్-ఎన్టీఆర్ ఫాన్స్ ని గాల్లో తేలేటట్టు చేసాయి. 

హెమ్స్ వర్త్ త్వరలోనే ఎక్స్ ట్రాక్షణ్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 2020లో వచ్చిన ఎక్స్ ట్రాక్షన్ కు ఎక్స్ ట్రాక్షణ్ 2 సీక్వెల్. 

Chris Hemsworth praises RRR, says he would love to work with Charan, NTR:

Chris Hemsworth praises RRR, says he would love to work with Ram Charan, Jr NTR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs