ఏడేళ్లు ప్రేమించుకున్న నయనతార-విగ్నేష్ శివన్ లు గుట్టుచప్పుడు కాకుండా ఎప్పుడో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నా.. గత ఏడాది ఇదే రోజు అంటే జూన్ 9 న మహాబలిపురం లోని రిజార్ట్స్ లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. నయనతార-విగ్నేష్ శివన్ లు సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. కొద్దిమంది సన్నిహితులు, కుటుంభ సభ్యుల నడుమ జరిగిన ఈ వేడుకకి రజినీకాంత్, షారుఖ్, అట్లీ లాంటి ప్రముఖులు హాజరయ్యారు.
అయితే పెళ్ళై ఏడాది పూర్తయిన సందర్భంగా నయనతార భర్త విగ్నేష్ ని తలుస్తూ ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. నువ్వు నా లైఫ్ లోకి ఎంటర్ అయ్యి అప్పుడే ఏడాది గడిచిపోయింది. ఈ ఏడాది కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము, ఎన్నో పరాజయాలను చవి చూసాము. ఎన్నో పరీక్షలు ఎదురయ్యాయు. ఇలాంటి ఎన్ని చికాకులు ఎదుర్కొన్నా.. ఒక్కసారి ఇంటికొచ్చి నిన్ను పిల్లలని చూడగానే అన్నీ మర్చిపోతాను. ఫ్యామిలీ ఇచ్చే బలం మరేదీ ఇవ్వలేదు. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.
ఉయిర్, ఉలగమ్ లకు మంచి లైఫ్ ని ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాను. నిన్ననే పెళ్లి చేసుకున్నట్టుగా ఉంది. అప్పుడే ఏడాది పూర్తయ్యింది అంటే నమ్మలేకపోతున్నాము. మనమిద్దరం కలిసి సాధించడానికి చాలా ఉన్నాయి. మన బ్యూటిఫుల్ లైఫ్ లోకి మరో ఏడాదికి స్వాగతం పలుకుదాం అంటూ ఎమోషనల్ గా నయనతార రాసిన నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.