ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ జూన్ 16 న వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అయితే ఆదిపురుష్ టీజర్ నుండి ఈ చిత్రంపై నెగిటివిటి మొదలు కాగా ఆదిపురుష్ ట్రైలర్ ఎంతో కొంత ఆ నెగిటివిని దూరం చేసింది. మధ్యలో ఆదిపురుష్ పై బోలెడన్ని కాంట్రవర్సీలు, కేసులు వచ్చినా.. ఆదిపురుష్ టీమ్ అదరక బెదరక ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్స్ మొదలు పెట్టింది. తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమాపై ఉన్న నెగిటివి పోయి భక్తి మొదలైంది. ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్ మరింతగా ఆకట్టుకుంది.
అయితే రాముడికి మీసాలేమిటి.. అసలు ప్రభాస్ రాముడిలా కాదు కర్ణుడిలా కనిపిస్తున్నాడంటూ ఇప్పుడో వివాదాస్పద నటి హాట్ కామెంట్స్ చేసింది. ప్రతి ఒక్క విషయంలో దూరి మీడియాలో హడావిడి చేసే నటి కస్తూరి ఆదిపురుష్ పై ఈ రకమైన కామెంట్స్ చేసింది. శ్రీముడికే కాదు ఆయన తమ్ముడు లక్షణుడిని కూడా మీసాలతో చూపించడం ఏమిటో అంటూ దర్శకుడు ఓం రౌత్ ని తప్పుబట్టింది.
టాలీవుడ్ లో ఎంతోమంది నటులు శ్రీరాముడి పాత్రల్లో కనిపించారు. ఎవరిని చూసినా భక్తి భావంతో కనిపించారు. కానీ ఆదిపురుష్ లో ప్రభాస్ అలా లేడు. ప్రభాస్ రాముడిగా కాకుండా కర్ణుడిగా కనిపిస్తున్నాడు.. అంటూ కస్తూరి చేసిన కామెంట్స్ పై ప్రభాస్ ఫాన్స్ ఆగ్రహిస్తున్నారు. ఈ వ్యాఖ్యలవుపై కస్తూరిని కొంతమంది సపోర్ట్ కూడా చేస్తున్నారు.