హీరో వరుణ్ తేజ్-హీరోయిన్ లావణ్య త్రిపాఠిలు పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యారు. ఐదేళ్ల ప్రేమని పెద్ద అంగీకారంతో వివాహ బంధంగా మార్చుకోబోతున్నారు. జూన్ 9 అంటే ఈరోజు సాయంత్రమే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ కి మెగా ఫ్యామిలీ ఏర్పాట్లు చేసింది. వధువు-వరుడు ఇద్దరూ సినీ ఇండస్ట్రీకి దగ్గరగా ఉన్నవారైనప్పటికీ.. ఈ నిశ్చితార్ధానికి మాత్రం ఇండస్ట్రీ ప్రముఖులకు ఆహ్వానం లేదని తెలుస్తుంది. ఇరు కుటుంబాల మధ్యలోనే ఈ ఎంగేజ్మెంట్ ని సింపుల్ గా ప్లాన్ చేశారట.
మరికాసేపట్లో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల నిశ్చితార్ధనికి అన్ని ఏర్పాట్లు ముగిసాయి. అయితే అటు వరుణ్ ఇంట్లోనూ కాకుండా, ఇటు లావణ్య ఇంట్లోనూ కాకుండా ఇరు కుటుంబాల వారు ఈ నిశ్చితార్ధాన్ని గెస్ట్ హౌస్ లో నిర్వహించబోతున్నారని టాక్. మెగా ఫ్యామిలోని మెగాస్టార్ ఆయన వైఫ్ సురేఖ, చరణ్, నాగబాబు ఫ్యామిలీ ఇంకా పవన్ కళ్యాణ్, మెగా సిస్టర్స్ హాజరవుతారని తెలుస్తోంది.
అటు లావణ్య ఫ్యామిలీ నుండి కూడా కేవలం ఆమె పేరెంట్స్ మాత్రం ఈ నిశ్చితార్థంలో కనిపిస్తారని, వరుణ్ తేజ్, లావణ్య ల స్నేహితులు ఈ ఎంగేజ్మెంట్ లో సందడి చేసే అవకాశం ఉంది. ఇక నిశ్చితార్ధం అవ్వగానే వరుణ్ తేజ్-లావణ్యల ఫస్ట్ పిక్ షేర్ చెయ్యాలని మెగా అభిమానులు ఆరాటపడిపోతున్నారు.