Advertisement
Google Ads BL

ట్విన్స్ ని ఎత్తుకుని మురిసిపోతున్న నయనతార


నయనతార-విగ్నేష్ శివన్ లు గత ఏడాది ఇదే సమయంలో వివాహం చేసుకున్నారు. నయన్-విగ్నేష్ ల వివాహానికి సూపర్ స్టార్ రజినీకాంత్, షారుఖ్ లాంటి సెలబ్రిటీస్ హాజరయ్యారు. అయితే పెళ్లి తర్వాత గుడులు, గోపురాలు, హనీమూన్ అంటూ హడావిడి చేసిన ఈ జంట పెళ్ళై మూడు నెలలు తిరిగేలోపులో తల్లి తండ్రులుగా మారారు. సరోగసి పద్దతిలో వీరు తల్లితండ్రులవగా.. అదో పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. దానిని వీరిద్దరూ లీగల్ గా ప్రొసీడయ్యి ఆ కాంట్రవర్సీ నుండి బయటపడ్డారు.

Advertisement
CJ Advs

ఆ తర్వాత ట్విన్స్ ని ఫేస్ లు కవర్ చేస్తూ రెండుమూడు సార్లు నయన్ జంట పబ్లిక్ లో కనిపించింది. నయనతార-విగ్నేష్ పిల్లలని మీడియా కూడా ఎలాగోలా కవర్ చేసేందుకు చాలా ట్రై చేసింది. అయినప్పటికీ నయన్ తమ పిల్లల ఫేస్ రివీల్ చెయ్యలేదు. నయన్-విగ్నేష్ లు తమ పిల్లలకి ఉయిర్ అండ్ ఉలాగ్ గా నామకరణం చేసారు. ఇక నయనతార తాజాగా తన పిల్లలని ఎత్తుకుని తన్మయత్వంలో ఉన్న పిక్స్ షేర్ చేసింది. బిడ్డల మొహాలని కవర్ చేస్తూనే నయన్ ఆ ఫొటోస్ లకి ఫోజులిచ్చింది. 

అయితే నయనతార చేతిలో ఉయిర్ అండ్ ఉలాగ్ ఉన్న పిక్స్ ఇప్పటివి కావు. వారు పసి పాపలుగా ఉన్నప్పటి పిక్స్. ప్రస్తుతం నయనతార పిల్లలు ఏడాది పూర్తి చేసుకోవడానికి దగ్గరవుతున్నారు. కానీ నయన్ చేతిలో ఉన్న పిల్లల పిక్స్ మాత్రం వాళ్ళు ఏ రెండు మూడు నెలలప్పుడో తీసుకున్న పిక్స్ కావొచ్చు. ప్రస్తుతమైతే ఆ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Nayanthara poses with her twins:

Nayanthara poses with her twins Uyir and Ulag
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs