Advertisement

రాముడి కోసమా.. బీజేపీ కోసమా?


గ్లోబల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ విషయంలో ఇప్పుడంతా వ్యక్తం చేస్తున్న అనుమానం ఇదే. ఈ సినిమా రాముడి కోసమా.. లేక బీజేపీ కోసం తీశారా? అసలు బీజేపీనే వెనకుండి ఈ సినిమా తీయించిందా? అనేలా అన్నిచోట్ల డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. మంత్రి కేటీఆర్ కూడా ఇదే విషయం ప్రస్తావించడం మరింతగా అనుమానాలకు చోటిస్తుంది. ఈ మధ్యకాలంలో బీజేపీ నేతలు సినిమా ఇండస్ట్రీలో ఎంతగా దృష్టి పెట్టారో తెలియని విషయం కాదు. ద కశ్మీర్ ఫైల్స్, ద కేరళ స్టోరి, కార్తికేయ 2, నిన్నగాక మొన్న రామ్ చరణ్ నిర్మాతగా అనౌన్స్ చేసిన నిఖిల్ సినిమా ‘ది ఇండియా హౌస్’.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ బీజేపీ భావజాలాన్ని ప్రజలపై రుద్దే సినిమాలే. ఇప్పుడు రాబోతోన్న ఆదిపురుష్ చిత్రం కూడా ఈ జాబితాలోకే చెందుతుందని కొన్ని రాష్ట్రాలలోని నాయకులు ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్స్ చేస్తున్నారు. 

Advertisement

ఆదిపురుష్ విషయానికి వస్తే.. రామాయణంలోని ఓ ముఖ్య ఘట్టాన్ని ఇప్పటి తరం ప్రేక్షకులకు తెలియజేయాలని మోడ్రన్‌గా ఈ సినిమాని తెరకెక్కించినట్లుగా యూనిట్ చెబుతూ వస్తుంది. కానీ ఆ నాయకుల మాటలు వింటుంటే.. ఈ సినిమా వెనక ఉన్న విషయం వేరే అనేది అర్థమవుతోంది. ఎప్పటి నుంచో సమస్యగా ఉన్న అయోధ్యలో రామ మందిరం ఇష్యూని బీజేపీ సాల్వ్ చేసిందని, ఇప్పుడా అస్త్రంతోనే ఎన్నికలకు వెళ్లాలనేది బీజీపీ మోటోగా చెబుతున్నారు. మరి ఆ విషయం అందరిలోకి వెళ్లాలంటే.. ఆదిపురుష్ వంటి సినిమా ఒకటి.. జై శ్రీరామ్ అనే స్లోగన్ అవసరమనే బీజేపీ ఇలా ప్లాన్ చేసిందనేది బీజేపీని వ్యతిరేకించే వారి వాదన. 

బీజేపీ వీరాభిమానులు కొందరు ఆదిపురుష్ సినిమా టికెట్లను 10వేలు చొప్పున కొనేసి పేదలకు పంచుతున్నామని ప్రకటించడం ఈ వాదనను మరింత బలపరుస్తోంది. విచిత్రం ఏమిటంటే.. టాలీవుడ్‌కి చెందిన ఓ ఆగ్ర ఫ్యామిలీ కూడా ఇందులో భాగమవడం. ఏదిఏమైనా ఆదిపురుష్ రాముని కోసం, రాముని భావాలను జనాల్లోకి తీసుకెళ్లడానికి తీసిన సినిమా కాదని.. బీజేపీ భావజలాన్ని జనాలపై రుద్దడానికి తీసిన సినిమా అనేలా.. టాక్ అయితే బాగా స్ప్రెడ్ అవుతోంది. దీనిని చిత్రయూనిట్ ఎలా ఖండిస్తుందో చూడాల్సి ఉంది.

Doubts on Global Star Prabhas Adipurush Movie:

Is BJP behind Aadipurush movie?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement