Advertisement
Google Ads BL

కేసరి అంటే అర్థం సింహమనే..


నందమూరి నటసింహ బాలకృష్ణ నటిస్తోన్న 108వ చిత్రానికి ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ.. మేకర్స్ గురువారం టైటిల్, ఫస్ట్ లుక్‌ని రివీల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ టైటిల్ అంతకు ముందే లీకయింది. మేకర్స్ రివీల్ చేయకముందు ఓ నాలుగైదు రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. మొదట ఈ టైటిల్‌ ఫ్యాన్స్‌కి అస్సలు నచ్చలేదు. అందుకు కారణం.. ‘సింహం’ సెంటిమెంట్. బాలయ్య సినిమాకు ‘సింహం’ అని లేకుండా ఏదో భగవంత్ కేసరి అంటాడేంటి? అని అనిల్ రావిపూడిపై నందమూరి ఫ్యాన్స్ గరం గరం అయ్యారు. కానీ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత టైటిల్‌ని పట్టించుకోవడం మానేశారు. 

Advertisement
CJ Advs

ఎందుకంటే ఫస్ట్ లుక్ అంత పవర్ ఫుల్‌గా ఉంది. ఈ ఫస్ట్ లుక్‌లో నటసింహం సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌‌లో.. అలాగే డిఫరెంట్ డ్రెస్సింగ్‌లో కనిపించారు. బ్రౌన్ కలర్ కుర్తా, ఫార్మల్ ప్యాంట్, చేతికి కడియం, మరో చేతికి వాచ్, మెడలో స్టోల్.. ఇలా డిఫరెంట్ లుక్‌లో బాలయ్య దర్శనమివ్వడంతో.. ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. అంతేకాదు, మోకాళ్లపై ఆయన కూర్చున్న తీరు, ఆవేశంతో ఆయుధాన్ని పట్టుకున్న విధానం.. బ్యాగ్రౌండ్, బాలయ్య ఎక్స్‌ప్రెషన్.. ఇవన్నీ చూసి ఫ్యాన్స్‌కి నిజంగానే పిచ్చెక్కిపోయింది. అందుకే టైటిల్ గురించి వారు పెద్దగా పట్టించుకోలేదు సరికదా.. అనిల్ రావిపూడిపై పూర్తిగా నమ్మకం పెట్టేశారు.

అయితే బాలయ్య సెంటిమెంట్‌ని, ఫ్యాన్స్ సెంటిమెంట్‌ని పక్కన పెట్టకుండా.. అనిల్ రావిపూడి కూడా పాటించాడు. టైటిల్‌లో ‘సింహం’ వచ్చేలా చూశాడు. అవును.. ‘భగవంత్ కేసరి’ అనేది టైటిల్. కేసరి అంటే సింహం అనే అర్థం. సింహం అని డైరెక్ట్‌గా కాకుండా.. అదే అర్థం వచ్చేలా అనిల్ రావిపూడి ప్లాన్ చేశాడు. టైటిల్‌లోగో భారతదేశ చిహ్నం (అశోక సింహ రాజధాని)తో డిజైన్ చేసిన తీరు కూడా అదే విషయాన్ని తెలియజేస్తుంది. ఇక ట్యాగ్‌లైన్.. ఐ డోంట్ కేర్ అయితే నటసింహంలోని ఎదురులేని వైఖరిని సూచిస్తుండటంతో.. టైటిల్, ఫస్ట్ లుక్‌లోనే ఫ్యాన్స్‌కి కావాల్సినవన్నీ ఉండేలా అనిల్ రావిపూడి జాగ్రత్తలు తీసుకున్నాడు. అందుకే.. ఫస్ట్ లుక్ విడుదల తర్వాత ఈ సినిమా స్వరూపమే మారిపోయింది. జూన్ 10న వచ్చే టీజర్‌తో బ్లాక్‌బస్టర్ ఆన్ ద వే అనే క్లారిటీని అనిల్ రావిపూడి ఇవ్వబోతున్నాడనేలా ఇప్పటికే టాక్ మొదలైంది. ఇక నందమూరి అభిమానులు పూనకాలకి సిద్ధమవ్వండి.

Bhagavanth Kesari is a Powerful Title :

<span>Bhagavanth Kesari.. Kesari Means Lion</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs