యాంకర్ అనసూయ అర్జున్ రెడ్డి సమయంలో విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తూ చేసిన ట్వీట్స్ తో.. ఆమె రౌడీ ఫాన్స్ కి టార్గెట్ అయ్యింది. అర్జున్ రెడ్డిలో విజయ్ బూతు మాట్లాడాడు, అమ్మగా నేను ఫీలయ్యా అంటూ అనసూయ ఓపెన్ గా కామెంట్స్ చేసింది. దానితో రౌడీ ఫాన్స్ రెచ్చిపోయి అనసూయని టార్గెట్ చేస్తూ ఆంటీ అంటూ చాలా ఇబ్బంది పెట్టారు. వారితో అప్పటినుండి స్టిల్ ఇప్పటివరకు పోరాడుతుంది. రీసెంట్ గానే విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా అకౌంట్‌లో ది దేవరకొండ అని పెట్టుకున్నాడని దానిపై సెటేరికల్ గా ట్వీట్స్ చేసింది. ఇక్కడ డైరెక్ట్ గా దేవరకొండ పేరు ఎత్తకుండా ది పెట్టుకోవడంపై వెటకారంగా మాట్లాడింది. మళ్ళీ రౌడీ ఫాన్స్ చేతిలో బుక్ అయ్యింది. సోషల్ మీడియాలో అనసూయని ఇష్టం వచ్చినట్లుగా ఆడుకుంటున్నారు వారు.
అయితే విజయ్ దేవరకొండతో గొడవపై ఓ ఇంగ్లీష్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్ట్ కామెంట్స్ చేసింది. విజయ్ తో ఆన్ లైన్ వార్ పై మాట్లాడింది. విజయ్ దేవరకొండతో నాకు ఎప్పటినుండో పరిచయం ఉంది. మేము మంచి ఫ్రెండ్స్ కూడా. ఆయన హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డిలో కొన్ని పదాలు థియేటర్స్ లో మ్యూట్ చేసారు. ఆ పదాలని విజయ్ తన అభిమానుల నోటి వెంట పలికించాడు. ఆ పదాలు విన్నప్పుడు ఓ అమ్మగా నేను బాధపడ్డాను. ఇలాంటివి ఎంకరేజ్ చెయ్యొద్దు అని ఆయనతోనే చెప్పాను. అప్పటినుండి నాపై ఆన్ లైన్ ట్రోల్స్ మొదలయ్యాయి.
ధైర్యంగా ఆ బాధ నుండి బయటికి వచ్చిన నేను విజయ్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన మీకు మాత్రమే చెప్తాలో నటించాను. కానీ విజయ్ తో సన్నిహితంగా ఉండే ఒకతను నన్ను ప్రత్యేకంగా సోషల్ మీడియాలో ట్రోల్ చెయ్యడానికి కొంతమందికి డబ్బులిస్తున్నాడని తెలిసి షాకయ్యను. ఇదంతా విజయ్ కి తెలియకుండానే జరుగుతుందా అనిపించింది. అసలు విజయ్ నన్ను ద్వేషిస్తున్నాడో, లేదో కూడా నాకు తెలియదు. అందుకే దీన్ని ఇక్కడితో ఆపేయ్యాలనుకుంటున్నాను.
దీన్ని ఇక్కడితో ఆపేసి ముందుకు సాగాలనుకుంటున్నాను. ఎందుకంటే మానసికరంగా అలిసిపోయాను. ఇకపై మానసిక ప్రశాంతత కావాలి అందుకే విజయ్ తో గొడవకి ఫుల్ స్టాప్ పెడుతున్నాను అంటూ అనసూయ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. మరి ఇప్పటికైనా అనసూయని ఆడుకునే రౌడీ ఫాన్స్ శాంతిస్తారేమో చూడాలి.