Advertisement
Google Ads BL

పెళ్లి పీటలెక్కబోతున్న మేఘ ఆకాష్


ఈరోజు ఎటు చూసినా పెళ్లి వార్తలే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మెగా హీరో వరుణ్ తేజ్ తో లావణ్య పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైంది. ఇంతలోనే మరో హీరోయిన్ పెళ్లి వార్త సోషల్ మీడియాని చేరింది. నితిన్ తో ఏకంగా రెండు సినిమాలు చేసినా హిట్ రాలేదు, ఆ తర్వాత ఒకటి రెండు తెలుగు ప్రాజెక్ట్స్ లో మెరిసినా ప్లాప్ హీరోయిన్ గానే ముద్ర వేయించుకున్న మెగా ఆకాష్ రీసెంట్ గా రవితేజ రావణాసుర తోనూ డిసాస్టర్ అందుకుంది.

Advertisement
CJ Advs

ఇప్పుడు మేఘ ఆకాష్ పెళ్లి చేసుకోబోతుంది అనే న్యూస్ ఈరోజు సడన్ గా హైలెట్ అయ్యింది. తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ పొలిటీషియన్ కొడుకుతో మేఘా ఆకాష్ పెళ్లి జరగబోతుందట. ఎప్పటినుండో ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉంటున్న మేఘ ఆకాష్ ఫ్యామిలీ, కన్యాకుమారికి చెందిన ఆ పొలిటిషన్ ఫామిలీస్ ఇప్పుడు వియ్యమందుకోవడానికి రెడీ అయ్యారట. పొలిటిషన్ కమ్ బిజినెస్ మ్యాన్ కొడుకును మేఘా ఆకాష్ పెళ్లి చేసుకోబోతుంది అని.. త్వరలోనే వీరి నిశ్చితార్ధం కూడా అనుకుంటున్నారట.

ఇక మూడోది బాలీవుడ్ క్యూటీ సారా అలీ ఖాన్ తన పెళ్లి వార్తలు, డేటింగ్ రూమర్స్ పై స్పందించింది. తాను ఎలాంటి వ్యక్తిని ఇష్టపడలేదు అంటూ శుభమాన్ గిల్ తో తన డేటింగ్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది. ఇలా ఈరోజు సోషల్ మీడియాలో ఎటు చూసినా పెళ్లి వార్తలే వినిపిస్తున్నాయి అంటే ఇదే మరి.

Megha Akash to marry a politician son:

Is actress Megha Akash getting married to a politician son?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs