బాలీవుడ్ క్యూటీ సారా అలీ ఖాన్ ఎప్పటినుండో క్రికెటర్ శుభమన్ గిల్ తో డేటింగ్ లో ఉంది అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. సారా అలీ ఖాన్ చాలా రోజులుగా శుభమన్ తో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నా ఈ విషయాన్ని బయటపెట్టడం లేదు అంటూ చాలా రకాల న్యూస్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే సారా అలీ ఖాన్ మాత్రం శుభమాన్ తో డేటింగ్ విషయమై ఫుల్ క్లారిటీ ఇచ్చింది. విక్కీ కౌశల్ తో సారా అలీ ఖాన్ నటించిన జర హాట్ కే జర బచ్ కే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సారా ని బాలీవూడ్ మీడియా డేటింగ్ రూమర్స్ పై ప్రశ్నించింది.
అయితే సారా మాత్రం క్రికెటర్ ని పెళ్లి చేసుకోడంలో తనకి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ.. దానికో కండిషన్ మాత్రం పెడుతుంది. మీకు కాబోయే భర్త ఎలా ఉండాలనుకుంటున్నారు అని సారాని అడగ్గానే.. నా మానసిక ఆధ్యాత్మిక విలువలకు సరితూగే వ్యక్తి దొరగ్గానే తప్పకుండా అతనితో జీవితం మొదలు పెట్టేందుకు సిద్దపడతాను. అతని ప్రొఫెషన్ గురించి ఆలోచించను. బిజినెస్ మ్యాన్ అయినా, క్రికెటర్ అయినా, యాక్టర్ ఇలా ఏ రంగంలోని వ్యక్తి అయినా నేను పట్టించుకోను.. నా విలువలకి గౌరవం ఇస్తే చాలు.
అంతేకాకుండా క్రికెటర్ శుభమన్ గిల్ తో డేటింగ్ లో ఉన్నారనే వార్తలపై కూడా సారా సూపర్బ్ ఆన్సర్ ఇచ్చింది. నా లైఫ్ పార్ట్నర్ ని నేనిప్పటివరకు మీట్ అవలేదు. ఇప్పటివరకు కలిసాను అని కూడా అనుకోడం లేదు. ఇది మాత్రం నమ్మకంగా చెబుతున్నాను అంటూ తాను ఎవరితో డేటింగ్ చెయ్యడం లేదు అని క్లారిటీ అయితే ఇచ్చేసింది.