Advertisement
Google Ads BL

సెకండ్ హీరోయిన్ గా ఒప్పుకుందా?


నిన్నటివరకు లక్కీ బ్యూటీ.. ఇప్పుడు ఐరెన్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కృతి శెట్టి ఇకపై సెకండ్ హీరోయిన్ అవకాశాలను ఓకె చేస్తుందా అంటే.. అవుననే సమాధానమే వస్తుంది. ఇప్పటివరకు సింగిల్ గా చక్రం తిప్పుదామనుకుంది. కానీ దేవుడు కరుణించలేదు. వరసగా మూడు హిట్స్ పడేసరికి పాపకి ఎదురు లేదు అనుకున్నారు. ఆతర్వాతే కృతి శెట్టికి అస్సలు టైమ్ బాలేదు అనుకునేలా నాలుగు భారీ డిజాస్టర్స్ తగిలాయి. 

Advertisement
CJ Advs

రామ్, నితిన్, సుధీర్ బాబు, నాగ చైతన్య నలుగురూ కృతి శెట్టికి చుక్కలు చూపించారు. దానితో పాప డిమాండ్ బాగా తగ్గింది. అందుకే ఇప్పుడు సెకండ్ హీరోయిన్ ఛాన్సెస్ కూడా ఒప్పుకుంటుంది అనే టాక్ మొదలైంది. తమిళంలో కార్తీతో జపాన్ మూవీలో నటిస్తున్న కృతి శెట్టికి ఇకపై యంగ్ హీరోల ఛాన్సెస్ అంతగా తగిలేలా లేవు. దానితో ఇప్పుడు తనకి ప్లాప్ ఇచ్చిన నితిన్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేయబోతుంది అనే టాక్ నడుస్తుంది.

నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల మెయిన్ హీరోయిన్ కాగా.. కృతి శెట్టిని సెకండ్ హీరోయిన్ గా అనుకుంటున్నారట, ఇంతకుముందు మాచర్ల నియోజకవర్గంలో కృతి శెట్టి నితిన్ సరసన నటించగా అది అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇక కృతి శెట్టికి ఇదే మొదటి సెకండ్ హీరోయిన్ సినిమా కాకపోయినా.. శ్యామ్ సింగ రాయ్ లో చిన్న పాత్రతో సరిపెట్టుకోలేదు. అందులో సాయి పల్లవితో సమానమైన రోల్ పోషించింది. 

కానీ ఇప్పుడు నితిన్ సినిమాలో సెకండ్ హీరోయిన్ కి ఎంత స్కోప్ ఉందో తెలియదు. ఆ పాత్ర కృతి శెట్టి చూస్తుంటేనే ఆమె అభిమానులు అయ్యా మా హీరోయిన్ సెకండ్ హీరోయిన్ ఛాన్సెస్ కి పరిమితమైపోతుందా తెగ ఫీలైపోతున్నారు.

Did you agree to be the second heroine?:

Did Krithi Shetty agree to be the second heroine?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs