Advertisement
Google Ads BL

ముంబైలో ల్యాండ్ అయిన అల్లు అర్జున్-స్నేహ


పుష్ప ద రూల్ షూటింగ్ లో ఉండాల్సిన అల్లు అర్జున్ ప్రస్తుతం వెకేషన్ మోడ్ లో ఉన్నారు. సుకుమార్ అండ్ టీమ్ మారేడుమిల్లు అడవుల్లో ఫహాద్ ఫాసిల్ పై పుష్ప ద రూల్ కీలక సన్నివేశాల ఎపిసోడ్ పూర్తయినట్లుగా రీసెంట్ గానే అప్ డేట్ ఇచ్చాక.. కొత్త అప్ డేట్ లో అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో జాయిన్ అయినట్లుగా చెబుతారు అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం భార్య స్నేహని తీసుకుని యూరప్ ట్రిప్ చెక్కేశారు. షూటింగ్స్ నుండి గ్యాప్ దొరగ్గానే భార్య, పిల్లలతో విదేశాలకు వెళ్లే అల్లు అర్జున్ ఈ సమ్మర్ కి యూరప్ వెళ్లారు.

Advertisement
CJ Advs

అల్లు అర్జున్ యూరప్ నుండి భార్య స్నేహతో కలిసి ముంబై ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. ముంబై ఎయిర్ పోర్ట్ లో అల్లు అర్జున్, స్నేహ ఇద్దరూ చాలా స్టైలిష్ గా కనిపించారు. పిల్లలు అర్హ, ఆయన్ లేరు. వీరిద్దరే యూరప్ ట్రిప్ ఎంజాయ్ చేసినట్లుగా ఉంది. అయితే యూరప్ నుండి ఇండియాకి తిరిగొచ్చిన వీరు డైరెక్ట్ గా హైదరాబాద్ రాకుండా ముంబైలో ఎందుకు ల్యాండ్ అయ్యారో అనేది చాలామందికి అర్ధం కాలేదు, కానీ అల్లు అర్జున్ మేకోవర్ కోసమే ముంబై వెళ్ళారా.. లేదంటే దర్శకుడు సందీప్ వంగా తో మీటింగ్ కోసమేమైనా అంటూ ఆరాలు తీస్తున్నారు.

పుష్ప పార్ట్ 2 తర్వాత అల్లు అర్జున్ సందీప్ వంగాతో మూవీ అనౌన్స్ చేసారు. సో దాని కోసం సందీప్ వంగాని కలవడానికి అల్లు అర్జున్ ముంబైలో దిగారేమో అనే అనుమానాలు అల్లు ఫాన్స్ లో మొదలయ్యాయి. ఇక అల్లు అర్జున్ ఎప్పుడెప్పడు పుష్ప తదుపరి షెడ్యూల్ లో జాయిన్ అవుతాడా అని ఆయన ఫాన్స్ అంతే ఆత్రంగా ఉన్నారు.

Allu Arjun and Sneha Reddy return from dreamy Europe Trip:

Allu Arjun and his wife Sneha are back after enjoying a vacation in Europe
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs