Advertisement
Google Ads BL

ఆదిపురుష్ ఈవెంట్ లో అదొక్కటే లోటు


నిన్న మంగళవారం సాయంత్రం తిరుపతిలో ప్రభాస్ లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంత గ్రాండ్ గా జరిగిందో అక్కడి జనసంద్రాన్ని చూస్తే తెలుస్తుంది. ప్రభాస్ ని రాముడిగా ఆరాధిస్తూ ఆయన అభిమానులే కాదు.. భక్తిభావం ఉన్న ప్రతి ఒక్కరూ ఆ ఈవెంట్ కి హాజరయ్యారా అనిపించేలా ఈవెంట్ ప్రాంగణం జన సమూహంతో నిండిపోయింది. ఆదిపురుష్ హీరో ప్రభాస్, హీరోయిన్ కృతి సనన్, దర్శకుడు ఓం రౌత్, టి సీరీస్ అధిపతులు, ఇంకా ఆదిపురుష్ ని తెలుగులో విడుదల చేస్తున్న పీపుల్స్ మీడియా అధినేతలు, యువి క్రియేషన్స్ వారు అందరూ హాజరయ్యారు. 

Advertisement
CJ Advs

చిన జీయర్ స్వామి ప్రత్యేక అతిధిగా హాజరై ప్రభాస్ ని, ఓం రౌత్ ని, కృతి సనన్ ని శాలువాలు కప్పి సన్మానించారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో ఆదిపురుష్ నుండి రెండో ట్రైలర్ లాంచ్ చేసారు. ఫుల్ యాక్షన్ ప్యాకెడ్ ట్రైలర్ గా ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్ ని అందరూ మెచ్చారు. రావణ్ గా సైఫ్ అలీ ఖాన్ కేరెక్టర్ చూసిన ప్రేక్షకులు సర్ ప్రైజ్ అయ్యారు. ఆదిపురుష్ లో అంత కీలక పాత్రలో కనిపించిన సైఫ్ అలీ ఖాన్ కూడా ఆదిపురుష్ ఈవెంట్ కి వచ్చి ఉంటే.. ఆ నిండుతనం మరొకలా ఉండేది.

కానీ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సైఫ్ అలీ ఖాన్ లేకపోవడం ప్రభాస్ ఫాన్స్ కే లోటుగా అనిపించింది.. పది తలల రావణుడిగా, మోడరన్ రావణ్ గా సైఫ్ అలీ ఖాన్ ప్రభాస్ తో తలపడబోతున్నాడు. ఈ ఈవెంట్ వేదికపై సైఫ్ కూడా కనిపిస్తే గ్రూప్ ఫోటోకి నిండుతనం వచ్చేది అనేది ప్రేక్షకుల ఫీలింగ్. మరి సైఫ్ అలీ ఖాన్ అటు ఎన్టీఆర్ దేవరలో నటిస్తూ బిజీగా ఉండి ఈ ఈవెంట్ కి రాలేకపోయి ఉండొచ్చని కొంతమంది సరిపెట్టుకుంటున్నారు. ఇకపై ఆదిపురుష్ ప్రమోషన్స్ లో సైఫ్ కనిపిస్తాడని ఆశిస్తున్నారు.

That is the only shortfall in the Adipurush event:

Saif Ali Khan missing in Adipurush event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs