Advertisement
Google Ads BL

నిన్న ప్రియాంక చోప్రా-నేడు మాళవిక మోహనన్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్ లో తలమునకలై ఉన్నారు. రీసెంట్ గానే కొరటాల శివ తో దేవర కొత్త షెడ్యూల్ లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యారు. ఇక అక్టోబర్ అయినా, నవంబర్ నుండి అయినా ఎన్టీఆర్ హిందీ వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవుతారని తెలుస్తుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హ్రితిక్ రోషన్ హీరోగా తెరకెక్కనున్న వార్ 2 లో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ లో కనిపిస్తారని బాలీవుడ్ మీడియా బలంగా చెబుతుంది.

Advertisement
CJ Advs

ఇక వచ్చే ఏడాది మార్చి కల్లా దేవర, వార్ 2 సషూటింగ్స్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ వుండడంతో ఎన్టీఆర్ తదుపరి ప్రశాంత్ నీల్ తో చెయ్యబోతే NTR31 సెట్స్ లోకి వెళ్ళిపోతారు. ఈమేరకు మైత్రి మూవీస్ వారి బిగ్గెస్ట్ అప్ డేట్ కూడా ఇచ్చారు. అయితే ప్రశాంత్ నీల్ ఇంతవరకు ఫుల్ స్క్రిప్ట్ కాని, నటుల ఎంపిక కానీ ఎన్టీఆర్ సినిమా కోసం మొదలు పెట్టలేదు. ఇంతలోనే ఎన్టీఆర్ ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంకతో రొమాన్స్ చేస్తారని, అంతకుముందే దీపికా పదుకొనె పేరు కూడా చక్కర్లు కొట్టింది.

గత రెండు రోజులుగా బాలీవుడ్, టాలీవుడ్ మీడియాలో ఎన్టీఆర్-ప్రియాంకర్ చోప్రాలు NTR31 లో జంటగా కనిపిస్తారంటూ ప్రచారం షురూ అవగా, నేడు తమిళ మీడియా NTR31 లో ఎన్టీఆర్ సరసన మాళవిక మోహనన్ నటించే ఛాన్స్ ఉంది.. అహ జస్ట్ బజ్ అంటూ ప్రముఖ తమిళ పీఆర్వో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆలు లేదూ చూలూ లేదూ కొడుకు పేరు సోమలింగం అన్నమాదిరి.. ప్రశాంత్ నీల్ ఏ హీరోయిన్ ని అనుకోకుండానే ఎన్టీఆర్ సరసన ఎవరికి నచ్చిన హీరోయిన్ ని వారి ఫిక్స్ చేసేసుకుంటున్నారు.

Yesterday Priyanka Chopra-today Malavika Mohanan:

Buzz: NTR to romance Malavika Mohanan for NTR31
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs