Advertisement
Google Ads BL

ఆదిపురుష్ డైరెక్టర్-హీరోయిన్ పై వివాదం


నిన్న తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి అందరూ చెప్పుకునేలా ఎంత గ్రాండ్ గా జరిగిందో.. నేడు ఆదిపురుష్ డైరెక్టర్-హీరోయిన్ కృతి సనన్ లపై అంతే పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. నిన్న మంగళవారం తెల్లవారు ఝామునే ప్రభాస్ తిరుమల చేరుకొని స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. నిన్న సాయంత్రానికి కృతి సనన్, దర్శకుడు ఓమ్ రౌత్ లు తిరుపతి చేరుకొని ఆదిపురుష్ ఈవెంట్ లో సందడి చేసారు. అయితే ఈవెంట్ ముగిసాక రాత్రి అక్కడే బస చేసిన ఓమ్ రౌత్-కృతి సనన్ ఈ రోజు బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్నారు.

Advertisement
CJ Advs

ఏడుకొండలవాడి ఆశీస్సులతో ఆదిపురుష్ హిట్ అవ్వాలని కోరుకున్న ఓమ్ రౌత్, కృతి సనన్ లు దర్శనానంతరం బయటికి వచ్చి మాఢవీధుల్లో నడుచుకుంటూ కారు ఎక్కే సమయంలో ఓమ్ రౌత్, కృతి సనన్ ని హగ్ చేసుకోడమే కాదు.. ఓమ్ రౌత్ ఆమెకి ముద్దు పెట్టడం, ఫ్లయింగ్ కిస్సులు ఇవ్వడం ధార్మిక సంఘాలకి ఆగ్రహాన్ని తెప్పించాయి. పవిత్రమైన తిరుమల కొండపై ఇలా ముద్దులు పెట్టడం ఏమిటి, ఓమ్ రౌత్ హద్దులు దాటాడంటూ కాంట్రవర్సీ మొదలయ్యింది.

పవిత్రమైన శ్రీవారి సన్నిధిలో ఉన్నప్పుడు ఎంత పవిత్రంగా ఉండాలి.. ఎంత సినిమా వాళ్ళైతే మాత్రం ఇలా ముద్దులు పెట్టుకుంటూ కొండని అపవిత్రం చేస్తారా అంటూ ఓమ్ రౌత్-కృతి సనన్ లపై మండిపడుతున్నారు. ఓం రౌత్ తీరుపై ధార్మిక సంఘాలు అభ్యంతరాలు లేవనెత్తాయి. ఇలాంటి పని వలన భక్తుల మనోభావాలు దెబ్బతింటాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Controversy erupts as Om Raut kisses Kriti Sanon:

Controversy erupts as Om Raut kisses Kriti Sanon at Tirumala temple
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs