Advertisement
Google Ads BL

మొన్న ఖుషి-నిన్న బద్రి ఏమిటి సంగతి ఊర్వశి


వాల్తేర్ వీరయ్యతో ఐటమ్ సాంగ్ లో అదరగోట్టిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేల్ల.. ఆ తర్వాత యంగ్ హీరో అఖిల్ తో ఏజెంట్ మూవీలోనూ స్పెషల్ లో ఆడిపాడింది. అలా టాలీవుడ్ ప్రేక్షకులకి ఐటెం గర్ల్ గా బాగా దగ్గరైంది. ఊర్వశికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ బ్రో మూవీ లో ఐటెం ఆకాశం తగిలింది అంటున్నారు. కానీ క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఊర్వశి మాత్రం చిన్న చిన్నగా తాను పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో అవకాశం వచ్చింది అంటూ చెప్పకనే చెబుతుంది.

Advertisement
CJ Advs

పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు వరసగా చూస్తుంది. చూస్తూ వాటిని ట్విట్టర్ లో చెబుతుంది కూడా. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ ఖుషి చూసాను అని ట్వీట్ చేసిన ఊర్వశి రౌతేల్ల ఇప్పుడు బద్రి సినిమా చూసినట్టుగా ఇచ్చిన అప్ డేట్ తో ఊర్వశి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ బ్రో చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ సినిమాలను చూసి ఆయన డాన్స్ స్టయిల్ ఎలా ఉంటుందో.. అనేది చూసి అబ్జర్వ్ చేస్తుంది అని అనుకుంటున్నారు.

సముద్రఖని దర్శకతంలో పవన్ కళ్యాణ్-సాయి తేజ్ కలయికలో తెరకెక్కుతున్న ఈ బ్రో మూవీ జులై 28న విడుదలకాబోతుండగా.. ప్రస్తుతం ఈ స్పెషల్ సాంగ్ పని మిగిలి ఉంది. పవన్ డేట్స్ రాగానే ఊర్వశితో ఈ సాంగ్ చిత్రీకరణ చేపడతారని తెలుస్తుంది.

Urvasi Rautela watches Pawan Kalyan Badri:

Urvasi Rautela watches Pawan Kalyan Khushi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs