Advertisement
Google Ads BL

నయనతారకి చెక్ పెడుతున్న త్రిష


కోలీవుడ్ లో ఎదురులేని హీరోయిన్ గా, అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ గా, లేడీ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న నయనతార నిన్నమొన్నటివరకు నెంబర్ 1 స్థానంలోనే ఉంది. స్టార్ హీరోలు, యంగ్ హీరోలు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు ఇలా ఎక్కడ చూసినా నయనతార పేరే వినిపించేది. కాజల్, సమంత లాంటి వాళ్ళు అప్పుడప్పుడు సందడి చేసి వెళ్ళిపోతారు. త్రిషకి కూడా కొన్నాళ్లుగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇక నయనతార గత ఏడాది విగ్నేష్ శివన్ తో పెళ్లి పీటలెక్కింది, అదే ఏడాది సరోగసి ద్వారా కవలల పిల్లలకి తల్లయ్యింది.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు అనూహ్యంగా త్రిష నయనతారకి చెక్ పెడుతుంది అనిపించేలా త్రిషకి స్టార్ ఛాన్సెస్ తగులుతున్నాయి. పొన్నియన్ సెల్వన్ తో ఒక్కసారిగా త్రిష లైమ్ లైట్ లోకి వచ్చేసింది. అంతకుముందు త్రిష వరసగా సినిమాలు చేసినా సక్సెస్ రాలేదు. కానీ పొన్నియన్ సెల్వన్ రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆమెకి ఆ చిత్రం స్టార్ ఛాన్సెస్ తెచ్చిపెడుతుంది. ఇప్పటికే విజయ్ తో LEO మూవీలో నటించేస్తుంది. తర్వాత అజిత్ సినిమాలో త్రిషనే హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది అనే న్యూస్ నడుస్తుంది.

ఆ తర్వాత కమల్ హాసన్-మణిరత్నం కలయికలో మొదలు కాబోయే చిత్రంలోనూ త్రిష పేరునే మణిరత్నం పరిశీలీనలో ఉంచారట. మరోపక్క ధనుష్ తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ కి కూడా త్రిషనే హీరోయిన్ అంటున్నారు. వన్ బై వన్ ఇలా వరస ఆఫర్స్ తో త్రిష హైలెట్ అవుతుంటే నయనతార మాత్రం ప్రస్తుతం జవాన్ మూవీలో చేస్తుంది.. అది తప్ప ఇతర ప్రాజెక్ట్స్ లో ఆమె పేరు పెద్దగా వినిపించడం లేదు.

తమిళంలో రెండు మూడు ప్రాజెక్ట్స్ నయన్ సైన్ చేసినా ఇంకా అవి మొదలు కాలేదు. ఇక ఆమె నటించిన విమెన్ సెంట్రిక్ మూవీస్ కూడా వరసగా ఫెయిల్ అవుతున్నాయి. మరి త్రిషకి గట్టిగా రెండు హిట్స్ తగిలితే.. ఆమె పేరునే మరోసారి కోలీవుడ్ కలవరించేలా కనబడుతుంది ప్రస్తుత వ్యవహారం.

Trisha is ruling the Kollywood now with big projects:

Actress Trisha is ruling the Kollywood now with big projects
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs