‘లస్ట్ స్టోరీస్2’ టీజర్.. తమన్నా తెగించేసింది


‘లస్ట్ స్టోరీస్’ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు కియారా అద్వానీ. ఇప్పటికే గూగుల్ సెర్చ్‌లో ‘లస్ట్ స్టోరీస్’ అని సెర్చ్ కొడితే ముందు కనిపించే ఫొటో ఆమెదే. అంతగా కియారాకు ఆ సిరీస్ పేరు తెచ్చి పెట్టింది. 2018లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఎంతగానో ప్రేక్షకాదరణ పొందింది. ఆ సిరీస్ వచ్చిన 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు సీజన్ 2 రాబోతోంది. ‘లస్ట్ స్టోరీస్ 2’ పేరుతో ఈ నెల 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోన్న ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. సీజన్ 1లో కియారా క్రెడిట్ కొట్టేస్తే.. సీజన్ 2లో మాత్రం ఆ క్రెడిట్ తమన్నా వశం చేసుకోనుందనేలా.. ఈ టీజర్ క్లారిటీ ఇచ్చేస్తోంది. 

‘ఓ కారు కొనే ముందు టెస్ట్ డ్రైవ్ చేస్తారు కదా! మరి, పెళ్ళికి ముందు టెస్ట్ డ్రైవ్ చేయరా?’ అని ఓ బామ్మ చెప్పే డైలాగ్‌తో ఈ టీజర్ మొదలైంది. ఈ డైలాగ్ ఒక్కటి చాలు.. ఈ సిరీస్‌లో శృంగారాన్ని ఏ రేంజ్‌లో దట్టించారో చెప్పడానికి. అలాగే ఈ టీజర్‌లో ఉన్న మరో ముఖ్య విషయం.. ఇప్పటి వరకు ఎక్స్‌పోజింగ్‌తోనే సెగలు పుట్టించిన మిల్కీ బ్యూటీ.. ఈ సిరీస్‌లో శృంగార సన్నివేశాలలో కూడా శృతిమించి నటించిందనేది ఈ టీజర్ స్పష్టం చేస్తుంది. అందులోనూ ఆమె ప్రస్తుతం ప్రేమలో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో శృంగార సన్నివేశాలు చేసింది. ఇక ఆ సీన్లు ఎలా వచ్చి ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదనుకుంటా. 

ఇక మొదటి సీజన్‌కు.. ఈ సీజన్‌కు ఉన్న తేడా ఏమిటంటే.. మొదటి సీజన్‌లో కియారా అద్వానీ, భూమి పెడ్నేకర్, రాధిక ఆప్టే, మనీషా కొయిరాలా వంటి వారు కనిపిస్తే.. ఈ రెండో సీజన్‌లో మాత్రం వారిని రీప్లేస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్ కనిపిస్తున్నారు. కాజోల్ పాత్ర ఈ సీజన్ 2కు బాగా హైలెట్ అయ్యేలా తీర్చిదిద్దినట్లుగా కనిపిస్తోంది. ఈ సీజన్ 2 మొత్తంగా నాలుగు స్టోరీలతో నలుగురు దర్శకులు తెరకెక్కించారు. జూన్ 29లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోన్న ఈ సిరీస్ ఏ రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే.. పెళ్ళికి ముందు శృంగారం తప్పు కాదన్నట్టుగా ప్రజంట్ చేసిన ఈ టీజర్ మాత్రం అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయినట్లే చెప్పుకోవచ్చు.

Lust Stories 2 Teaser Talk:

Tamanna Highlight in Lust Stories 2 Series
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES