Advertisement
Google Ads BL

హెల్ప్ చేస్తా అన్న.. కిర్రాక్ ఆర్పీ ఏమైపోయాడు!


కిర్రాక్ ఆర్పీ ఆల్మోస్ట్ సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడనిపిస్తుంది. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు క్లిక్ అవడంతో ఆర్పీ ఇటు కామెడీకి, సినిమాలకి డిస్టెన్స్ మెయింటింగ్ చేస్తున్నా.. ఎప్పుడోకప్పుడు దర్శకుడిగా సినిమా చెయ్యాలనే కసితో ఉన్నాడు. అయితే జబర్దస్త్ లో పాపులర్ అయ్యి దాని నుండి బయటికొచ్చాక జబర్దస్త్ పై అలిగేషన్స్ చేసాడు. అక్కడ ఫుడ్ బాగోదు, అక్కడ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మల్లెమాల యాజమాన్యం మాకేమి ఫ్రీగా పారితోషకం ఇవ్వలేదు, మేము కష్టపడ్డాం, మా టాలెంట్ వాడుకుని వాళ్ళు బాగుపడ్డారు. మాకు పారితోషకాలిచ్చారు, మేము ఎక్కడైనా బ్రతగ్గలమంటూ జబర్దస్త్ యాజమాన్యంపై చాలా ఓవర్ గా కామెంట్స్ చేసాడు. 

Advertisement
CJ Advs

అప్పట్లోనే జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కి ఆరోగ్యం బాగోకపోతే నాగబాబు గారే అన్ని చేసారు. తలో ఇంతా వేసుకుని అతని ఆసుపత్రి ఖర్చులు భరించాం, కానీ శ్యాం ప్రసాద్ రెడ్డి మాత్రం చిల్లి గవ్వ ప్రసాద్ కి సాయం చెయ్యలేదు అంటూ తనకి అన్నం పెట్టిన సంస్థనే నానా మాటలన్నాడు. ఇక చేపలు పులుసు పబ్లిసిటీలో భాగంగా ఆర్పీ ఛానల్స్ తో మాట్లాడుతూ పంచ్ ప్రసాద్ కిడ్నీ ఆపరేషన్ కి అయ్యే ఖర్చు తాను భరిస్తాను అంటూ హామీ ఇచ్చాడు. ఇప్పుడు చూస్తే ఆర్పీ కామ్ గా కనబడుతున్నాడు. 

పంచ్ ప్రసాద్ ఆరోగ్యం ఏమాత్రం బాలేదు. జబర్దస్త్ కమెడియన్స్ అంతా కలిసి అందరి దగ్గర పోగేసిన డబ్బు ఏడెనిమిది లక్షలైతే.. మిగతావి దాతల నుండి సాయం కోరుతూ ప్రతి కమెడియన్ సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు. పంచ్ ప్రసాద్ కిడ్నీ ఆపరేషన్ కి చాలా ఖర్చవుతుంది. అతను ఆసుపత్రి పాలైతే నడవలేడు, సో ఆర్ధిక పరిస్థితి ఏమాత్రం బావుండలేదు. అతనికి సాయం చేస్తే మళ్ళీ కోలుకుంటాడంటూ జబర్దస్త్ బ్యాచ్ మొత్తం సోషల్ మీడియాలో అర్దిస్తుంది. 

కానీ ఆపరేషన్ ఖర్చు భరిస్తాను అని చెప్పిన ఆర్పీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదంటూ నెటిజెన్స్ కూడా ఆర్పీ గురించి తెగ వెతికేస్తున్నారు. మరి ఆర్పీ ఏమంటాడో చూడాలి.

What happened to Kirrak RP!:

I will bear the cost of Punch Prasad kidney operation: RP
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs