Advertisement
Google Ads BL

అనూ.. ఇదేదో అప్పుడే చేసుండాల్సింది


కొన్నిసార్లు మనం చేసే చిన్న చిన్న తప్పులు.. మనకు కావాల్సిన, రావాల్సిన గుర్తింపును దూరం చేస్తాయనే దానికి ఉదాహరణగా క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సమయంలో ఈ భామ తీసుకున్న కొన్ని నిర్ణయాలు.. ఆమెని టాలీవుడ్‌ టాప్ ఛైర్‌కి దూరం చేశాయని చెప్పుకోవాలి. ఇప్పుడసలు అవకాశాలే రాని స్టేజ్‌కి వెళ్లిన క్రమంలో ఆ నిర్ణయాలను పక్కనెట్టి.. ఇక చూసుకోండి అనేలా అనుపమ అల్లాడించేస్తుంది. అందుకు ఎగ్జాంపుల్ రౌడీ బాయ్స్, టిల్లు స్వ్కేర్ చిత్రాలే. 

Advertisement
CJ Advs

రౌడీ బాయ్స్ చిత్రంలో ఇంట్రడ్యూసింగ్ హీరో ఆశిష్‌తో.. రెచ్చిపోయి మరీ లిప్‌లాక్ చేసి అందరికీ షాకిచ్చింది. తాజాగా వచ్చిన ‘డీజే టిల్లు’ సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ పోస్టర్‌లో అయితే స్టార్‌బాయ్ సిద్ధుతో ఆమె చేస్తున్న రొమాన్స్.. మాములుగా లేదు. నిజంగా ఆ స్టిల్‌లో ఉంది అనుపమేనా? అనేలా అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక ఆమె ‘పద్దతి’ నిర్ణయానికి ఫ్యాన్స్ అయిన వాళ్లయితే.. బాగా హర్టవుతూ.. అనుపమపై సీరియస్‌ అవుతున్నారు. అను.. ఇలా మారిపోతావని అనుకోలేదు.. ఇకపై నీ ఫ్యాన్స్‌గా కొనసాగలేం అంటూ ఆమెకు బైబై చెప్పేస్తున్నారు. 

అదలా ఉంటే.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎటువంటి కాంపిటేషన్ ఉందో తెలియంది కాదు. టాలీవుడ్ క్రష్ శ్రీలీల అందరినీ పక్కకు నెట్టేస్తూ దూసుకెళుతోంది. ఆమెకు పోటీగా నిలబడాలంటే.. ఈ మాత్రం కంపల్సరీ. అందుకే అనుపమ తన నిర్ణయాన్ని పక్కనెట్టి.. డోస్ పెంచే పనిలో ఉంది. కాకపోతే.. ఇదేదో అప్పుడే చేసుంటే.. పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదు కదా.. అని కొందరు విమర్శకులు ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు. మరి పోస్టర్‌లోనే ఈ రేంజ్‌లో ఉంటే.. ‘టిల్లు స్క్వేర్’లో అనూ ఏ రేంజ్‌లో హద్దులు దాటేసి ఉంటుందో.. ఊహించుకుంటుంటేనే యమా కిక్ వచ్చేస్తుంది కదా..

Hot Discussions on Anupama Parameswaran Romance with Siddhu:

Anupama Parameswaran Green Signal to Romantic Scenes
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs