Advertisement
Google Ads BL

మూడ్ లేకుండా ఏం చేసినా ఏం లాభం?


ఏదైనా చేయాలంటే మూడ్, ఉత్సాహం వంటివి ఉండాలి. ఆ మధ్య న్యూస్ రీడర్ ఒకతను వార్తలు చదివే వీడియో ఒకటి ఎలా వైరల్ అయిందో తెలియంది కాదు. న్యూస్ చదివే క్రమంలో అందులో ఉన్న తప్పులు చూసి.. చదవాలన్న మూడ్, ఉత్సాహం అన్ని పోయాయంటూ.. ఆ న్యూస్ రీడర్ గరంగరం అవుతాడు. అలాగే ఇప్పుడు అఖిల్ ఏజెంజ్ విషయంలోనూ అదే తప్పులు చేస్తూ.. ప్రేక్షకులకు మూడ్, ఉత్సాహం లేకుండా చేస్తున్నారు. అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో పాన్ ఇండియా రేంజ్‌లో (అన్నారు కానీ.. విడుదల చేయలేదులే) తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’. 

Advertisement
CJ Advs

ఈ సినిమా థియేటర్లలో విడుదలై.. ఎటువంటి రిజల్ట్‌ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్స్‌లో సక్సెస్ కానీ కొన్ని చిత్రాలు ఓటీటీలో మంచి సినిమాలుగా నిలిచి భారీగా వ్యూస్ రాబట్టిన సందర్భాలు ఉన్నాయి. ‘ఏజెంట్’ని కూడా అదే మూడ్‌లో అంటే.. విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీ అంటూ ప్రకటన చేసిన టైమ్‌లో విడుదల చేసి ఉంటే మాత్రం.. టాక్‌తో సంబంధం లేకుండా ఖచ్చితంగా మంచి వ్యూస్ రాబట్టేది. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించి కూడా మళ్లీ వాయిదా వేశారు. 

అదేమంటే.. అనవసర సీన్లను ఎడిట్ చేసి.. ఓటీటీలో ఫ్రెష్‌గా ఈ సినిమాని విడుదల చేస్తున్నారనేలా చెబుతున్నారు. వేడిలో వేడిగా మొదట చెప్పిన టైమ్‌కే ఈ సినిమాని స్ట్రీమింగ్ చేసి ఉంటే.. ఎటువంటి రిజల్ట్ వచ్చినా.. థియేట్రికల్ రిజల్ట్‌లో కొట్టుకుపోయేది. కానీ ఇప్పుడా సినిమాపై ఎవరికీ మూడ్, ఇంట్రస్ట్ లేదనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత ఎడిట్ చేసినా.. ఉన్న విషయాన్ని మార్చలేరు.. పైగా రీ ఎడిటింగ్‌కు ఇంకొంత అమౌంట్ వేస్ట్. మొత్తంగా చూస్తే.. మేకర్సే ఈ సినిమాని ఏ రకంగా కావాలంటే ఆ రకంగా కిల్ చేశారేమో? అని అక్కినేని అభిమానులు కొందరు మాట్లాడుకుంటుండటం విశేషం.

Akkineni Fans Reaction on Akhil Agent OTT Release:

Fans and Audience Not Interested on Akhil Agent OTT Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs