Advertisement
Google Ads BL

నయనతార బ్యూటీ సీక్రెట్స్ అవుట్


నయనతార గజినీ, చంద్రముఖి చిత్రాల్లో చూసినప్పుడు ఎలా ఉందో.. ఇన్నేళ్లయినా ఇప్పటికీ అదే అందాన్ని, అదే ఫిట్ నెస్ ని మెయింటింగ్ చేస్తూ స్టార్ అవకాశాలతో దూసుకుపోతుంది. విమెన్ సెంట్రిక్ మూవీస్ కి కేరాఫ్ గా కనిపిస్తున్న నయనతార ఈ వయసులోనూ స్టార్ హీరోల ఛాన్సెస్ తో అత్యధిక పారితోషకం అందుకుంటున్న తారగా సౌత్ లోనే మొదటి స్థానంలో ఉంది. లేడీ సూపర్ స్టార్ గా నయనతారని ఆమె అభిమానులే కాదు చాలామంది ఆరాధిస్తారు.

Advertisement
CJ Advs

అయితే నయనతార అంత అందాన్ని, గ్లామర్ ని ఇప్పటికీ మెయింటింగ్ చెయ్యడం వెనుక అసలు సీక్రెట్స్ బయటకి వచ్చాయి. నయనతార రొటీన్ లైఫ్ చాలా సింపుల్ గా ఉంటుందట. అలాగని బరువు తగ్గడానికి జిమ్ లో గంటల తరబడి వర్కౌట్స్ చెయ్యదట. ఆమె మొదటి నుండి రెండుగంటల పాటు యోగ చేస్తుందట. ఆమె బ్యూటీ సీక్రెట్స్ లో యోగానే మెయిన్ అట. జిమ్ లో వర్కౌట్స్ చేసినా అది చాలా పరిమితంగానే ఉంటుందట. ఇక డైట్ లో ప్రతి రోజు కోకోనట్ వాటర్ ఉండాల్సిందేనట. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ టైమ్ లో ఫ్రూట్ జ్యూస్ కి ఇంపార్టెన్స్ ఇస్తుందట. మధ్యాన్నం లంచ్ లో ఎగ్, నాన్ వెజ్, వెజిటేబుల్స్ అన్నీ సమపాళ్లలో తీసుకుంటుందట.

జంక్ ఫుడ్స్ కి దూరంగా.. హెల్త్ కి ఏవి మంచివో ఆ ఆహారాన్నే నయనతార తీసుకుంటుందట. అంతేకాదు.. కంపల్సరీ రోజుకి 8 గంటలు నిద్ర పోతుందట. ఆరోగ్యంలో ప్రధాన అంశం నిద్రేనట. అందుకే నయనతార క్రమం తప్పకుండా ఎనిమిది గంటల నిద్ర పోతుందట. గత ఏడాది విగ్నేష్ శివన్ తో ఏడడుగులు నడిచిన నయనతార అదే ఏడాది సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకి తల్లయ్యింది.

Nayanthara Beauty Secrets Out:

Nayanthara secrets and tips for good skin
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs