Advertisement
Google Ads BL

శ్రీవారి సుప్రభాత సేవలో ప్రభాస్


ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనేందుకు గత రాత్రి స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ నుండి తిరుమల తిరుపతి బయలు దేరి వెళ్లారు. నేడు తిరుపతిలో అంగరంగ వైభవంగా ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇందుకోసం ప్రభాస్ అలాగే చిత్రబృందం ఇప్పటికే తిరుపతి చేరుకుంది. 

Advertisement
CJ Advs

ఈరోజు తెల్లవారుజామున శ్రీవారి ఆలయానికి వెళ్లిన ప్రభాస్ పంచె కట్టులో సంప్రదాయ పద్ధతిలో కనిపించారు. తెల్లవారుఝామున 5 గంటల ప్రాంతంలో తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ప్రభాస్​కు ఘనస్వాగతం పలికారు. స్వామి వారి దర్శనానంతరం వేదపండితుల ఆశీస్సులు తీసుకున్న ప్రభాస్.. అనంతరం గెస్ట్ హౌజ్​కు వ్వెల్లాగా.. అక్కడ ప్రభాస్ ని చూసేందుకు ఆయన అభిమానులు ఎగబడ్డారు. 

ప్రభాస్ అభిమానులని కంట్రోల్ చేయడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. ఈరోజు సాయంత్రం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుకకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్పెషల్ గా వేసిన అయోధ్య సెట్ లో ఇండియన్ సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగుని రీతిలో ఈ ప్రీ రిలీజ్ వేడుక జరగబోతుంది. ఇదే వేడుకలో ఆదిపురుష్ 2nd ట్రైలర్ ని లాంచ్ చెయ్యబోతున్నారు మేకర్స్.

Prabhas Visits Tirumala Temple:

Prabhas seeks Lord Venkateswara blessings in Tirupati ahead of Adipurush pre-release event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs