Advertisement
Google Ads BL

క్యూటీ కళ్యాణి ప్రియదర్శి


టాలీవుడ్ హీరో అఖిల్ తో తెరకి పరిచయమైన కల్యాణి ప్రియదర్శికి మొదటి సినిమా సో సో రిజల్ట్ నే ఇచ్చింది. అఖిల్-కళ్యాణి ప్రియదర్శి జంటగా కనిపించిన హలో మూవీ అలా అలా ప్రేక్షకులని పలకరించి పోయింది. ఆ చిత్రంలో బ్యూటిఫుల్ ట్రెడిషనల్ లుక్ తోనే బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కళ్యాణి వరసగా తెలుగు హీరోలతోనే నటించింది. సాయి ధరమ్ తేజ్ చిత్రలహరిలో వన్ అఫ్ ద హీరోయిన్ గా నటించగా అది ఆమెకి హిట్ ఇవ్వలేదు. యావరేజ్ ఫిల్మ్ గానే చిత్రలహరి నిలిచింది. ఆ తర్వాత శర్వానంద్ తో రణరంగం అనే మాస్ మూవీలో నటించగా.. ఆ చిత్రం పాపకి డిసాస్టర్ ని కట్టబెట్టింది.

Advertisement
CJ Advs

ఆపై తెలుగు కలిసి రాదనుకుందో.. లేదంటే ఆకాశాలు రాలేదో కానీ.. మళ్ళీ తెలుగులో కనిపించలేదు. కానీ తమిళ, మలయాళ ఫిలిమ్స్ లో కళ్యాణి మెరుస్తుంది. మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ తో ప్రేమలో ఉందనే టాక్ నడుస్తుంది. కళ్యాణి పేరెంట్స్ లిజి-ప్రియదర్శిలు సినిమా ఇండస్ట్రీకి అత్యంత సన్నహితులే. కానీ కల్యాణికి బ్రేక్ ఇచ్చే తెలుగు సినిమా మాత్రం ఆమెకి దొరకడం లేదు. ఇక సోషల్ మీడియాలో కళ్యాణి ప్రియదర్శి ఫోటో షూట్స్ చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. 

తాజాగా కళ్యాణి పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా అవి ఇట్టే వైరల్ అయ్యాయి. ఆ పిక్స్ తో చాలా క్యూట్ గా బ్యూటిఫుల్ లుక్స్ తో కళ్యాణి ఆకట్టుకునేలా కనిపించింది. బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో లూజ్ హెయిర్ తో సింపుల్ గానే కనిపించినా చాలా అందంగా కనిపించి మెస్మరైజ్ చేసింది. 

Cute Kalyani Priyadarshan:

Kalyani Priyadarshan beautiful look
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs