Advertisement
Google Ads BL

టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ వచ్చేసింది


డీజే టిల్లుతో యూత్ గుండెల్లో హీరోగా బలమైన ముద్ర వేసిన సిద్దు జొన్నలగడ్డ ఆ తర్వాత చాలా సినిమా ఈవెంట్స్ లో హుషారుగా కనిపించాడు. డీజే టిల్లు పాత్రను ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడ్డారు. డీజే టిల్లు తర్వాత ఆయన ఎలాంటి సినిమాతో వస్తాడో అనుకుంటే తనని సక్సెస్ ట్రాక్ ఎక్కించిన డీజే టిల్లుకి సీక్వెల్ ప్రకటించాడు. టిల్లు స్క్వేర్ అంటూ టైటిల్ ప్రకటించినప్పటినుండే అందరిలో తన సినిమాపై ఆసక్తిని క్రియేట్ చెయ్యడం ఫుల్ గా సక్సెస్ అయ్యాడు.

Advertisement
CJ Advs

ప్రస్తుతం టిల్లు స్క్వేర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. డీజే టిల్లు చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న సిద్ధు, అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. డీజే టిల్లు సీక్వెల్‌ టిల్లు స్క్వేర్ తో  రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధుకి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తోడయ్యింది.

ఈ సినిమాని 2023, ఆగస్టు లో విడుదల చేస్తారనే ప్రచారం జరిగినా ఇప్పుడు సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం, సిద్ధు-అనుపమ పరమేశ్వరన్‌ ల రొమాంటిక్ పోస్టర్‌ ను విడుదల చేసింది. ఈ చిత్రం మొదటి భాగాన్ని మించి రెట్టింపు వినోదాన్ని, థ్రిల్ ని అందిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Tillu Square Release Date announced :

Starboy Siddhu and Sithara Entertainments Tillu Square Release Date announced 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs