Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ దేవర కొత్త షెడ్యూల్ అప్డేట్


ఎన్టీఆర్ నిమిషం తీరిక లేని బిజీ లైఫ్ లోకి వచ్చేసారు. ఏడాది కాలంగా ఆర్.ఆర్.ఆర్ ని సక్సెస్ ని మోస్తున్న ఆయన గత రెండు నెలలుగా కొరటాలతో చేస్తున్న దేవర షూటింగ్ లో నిమగ్నమయ్యారు. రీసెంట్ గా ఓ వారం దేవర షూటింగ్ నుండి బ్రేక్ దొరకడంతో ఫ్యామిలీతో హడావిడిగా దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేసుకుని భార్య పిల్లలతో కలిసి వెకేషన్ కి వెళ్ళిపోయారు. వారం తిరక్కుండానే మొన్న శనివారం రాత్రి హైదరాబాద్ కి చేరుకున్నారు.

Advertisement
CJ Advs

ఇక ఈరోజు నుండి కొరటాల శివతో దేవర కొత్త షెడ్యూల్ లో ఎన్టీఆర్ అడుగుపెట్టినట్లుగా తెలుస్తుంది. ఈరోజు నుండి ప్రత్యేకంగా వేసిన ఓ సెట్ లో ఎన్టీఆర్-సైఫ్ అలీ ఖాన్ పై కీలక సన్నివేశాలని కొరటాల ప్లాన్ చేసారని, హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఈ షెడ్యూల్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది అని తెలుస్తుంది. పక్కా స్క్రిప్ట్ తో కొరటాల ప్రతి షెడ్యూల్ ని ప్లాన్ చేసుకుని షూటింగ్ కి గ్యాప్ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారని చెబుతున్నారు.

ఈరోజు మొదలు కాబోయే దేవర షెడ్యూల్ ఓ 15 రోజుల పాటు నిర్విరామంగా ప్లాన్ చేశారట. అక్టోబర్ లేదా నవంబర్ కల్లా దేవర షూటింగ్ ని ఓ కొలిక్కి తెచ్చేసేలా కొరటాల ప్రతిదీ పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారట.

NTR Join Devara Latest Schedule:

NTR Join Devara Latest Schedule From June 5th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs