ఆర్.ఆర్.ఆర్ తో గ్లోబర్ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ కి అంతే ప్రెజర్ ఉంది. ఎందుకంటే ఆర్.ఆర్.ఆర్ అంత గొప్ప సబ్జెస్ట్, ప్యాన్ ఇండియా ప్రేక్షకులు మెచ్చే సినిమా చెయ్యాలి. అందుకు కంటెంట్ ముఖ్యం. కాబట్టే కొరటాల తో సినిమాని ఏడాది గ్యాప్ తో మొదలు పెట్టాడు. స్క్రిప్ట్ మొత్తం పక్కాగా రెడీ అయ్యాకే ఫుల్ స్క్రిప్ట్ తో సెట్స్ మీదకి వెళ్లారు. ప్రస్తుతం దేవర షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తో రొమాన్స్ చేస్తున్నాడు.
ఇక ఎన్టీఆర్ తదుపరి మూవీ వార్ 2. బాలీవుడ్ లో వార్ 2 లాంటి పవర్ ఫుల్ యాక్షన్ మూవీతో ఎంట్రీ ఇవ్వబోతున్న ఎన్టీఆర్ కి ఆ సినిమాలో అసలు హీరోయిన్ లేదనే టాక్ నడుస్తుంది. హీరో హ్రితిక్ రోషన్ కి కానీ, ఎన్టీఆర్ కి కానీ హీరోయిన్స్ ఉండరని తెలుస్తోంది. ఇక ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చెయ్యబోయే ప్యాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది మార్చ్ లో పట్టాలెక్కే ఛాన్స్ ఉంది అంటూ ఈమధ్యనే మైత్రి మూవీస్ వారు అప్ డేట్ ఇచ్చారు.
అయితే ఈచిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కానీ, నటుల ఎంపిక కానీ మొదలు కాలేదు. ఇంతలోపులో ఎన్టీఆర్ ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా తో జోడి కడతాడని ఓసారి అంటే.. ఇప్పుడేమో గ్లోబల్ యాక్ట్రెస్ ప్రియాంకర్ చోప్రా తో ఎన్టీఆర్ రొమాన్స్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. బాలీవుడ్ నుండి హాలీవుడ్ రేంజ్ ని మెయింటింగ్ చేస్తున్న ప్రియాంక చోప్రాతో కలిసి నటిస్తే ఆ అంచనాలు మాములుగా ఉండవు. NTR31 కథలో హీరోయిన్ పాత్ర చాలా కీలకం అని.. అందుకే ఆ పాత్రలో స్టార్ నటి ప్రియాంక చోప్రా నటిస్తే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇది నిజమా.. కాదా అనేది సినిమా మొదలైతే కానీ క్లారిటీ రాదు.