Advertisement
Google Ads BL

పెళ్లి రోజున ఏంటీ రచ్చ అనసూయా..


అనసూయ అంటే గ్లామర్, గ్లామర్ అంటే అనసూయ. యాంకరింగ్ కి గ్లామర్ టచ్ ఇచ్చి కొన్నేళ్లపాటు సక్సెస్ ఫుల్ యాంకర్ గా కొనసాగిన అనసూయ ఇప్పుడు ఆ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసి ఏడాది అవుతుంది. యాంకరింగ్ నుండి వెండితెర మీదకి షిఫ్ట్ అయ్యి అక్కడ సక్సెస్ అవడంతో బుల్లితెరని పక్కనపడేసింది. ఇప్పుడు వెండితెర మీద జెండా పాతడానికి రెడీ అయ్యింది. సిల్వర్ స్క్రీన్ పై గ్లామర్ రోల్స్ రాకపోయినా.. పెరఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలతో హైలెట్ అవుతుంది.

Advertisement
CJ Advs

ప్రెజెంట్ సుమతి పాత్రలో విమానంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్ గా ఉండే అనసూయ ఇప్పుడు కూడా అటు విమానం ప్రమోషన్స్ కోసం వస్తూ.. అందుకు సంబందించిన సారీ పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఇటు భర్త భరద్వాజ్ తో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్న పిక్స్ పోస్ట్ చేస్తుంది. నేడు జూన్ 4 అనసూయ-భరద్వాజ్ ల వెడ్డింగ్ యానివర్సరీ. పెళ్లి రోజు సెలెబ్రేషన్స్ కోసం భార్య-భర్త ఇద్దరూ కలిసి థాయ్ లాండ్ వెకేషన్స్ కి వెళ్లారు.  

భర్త భరద్వాజ్ తో కలిసి థాయ్ లాండ్ బీచ్ లో పెళ్లి రోజుని హ్యాపీగా జరుపుకున్న అనసూయ భర్తని హగ్గులు, ముద్దులతో ముంచెత్తిన వీడియో ఇన్స్టాలో పోస్ట్ చేసింది. బికినీ లాంటి డ్రెస్ లో అనసూయ గ్లామర్ గా కనిపించగా భరద్వాజ్ కూడా భార్య తో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేస్తూ సందడి చేసాడు. అనసూయ బీచ్ అందాలు, భర్తతో కలిసి ఉన్న పిక్స్ చూసిన నెటిజెన్స్ ఏంటి అనసూయ ఈ రచ్చ అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

Anasuya and her Husband Bharadwaj enjoying their wedding anniversary:

Anasuya Bharadwaj Share Video And Pics With Her Husband
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs