Advertisement
Google Ads BL

ఫైనల్ గా ఓటిటిలోకి వస్తున్న ఏజెంట్


అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ గురించి ఎప్పుడో మర్చిపోవాల్సింది.. ఇంకా ఇంకా వార్తల్లో నిలవడానికి అసలు కారణం ఏజెంట్ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ పై రాని స్పష్టత. ఏప్రిల్ 28 న థియేటర్స్ లో విడుదలైన ఏజెంట్ చిత్రం డిసాస్టర్ అవ్వడంతో.. ఈ చిత్ర డిజిటిల్ రైట్స్ ని సొంతం చేసుకున్న సోని లివ్.. మూడు వారాల్లోపే అంటే ఏప్రిల్ 18 నే ఓటిటి స్ట్రీమింగ్ అంటూ అధికారిక ప్రకటన ఇచ్చింది.

Advertisement
CJ Advs

కానీ అనుకున్న సమయానికి ఏజెంట్ ఓటిటీ లోకి రాలేదు. తర్వాత సోని లివ్ ఎప్పుడెప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ డేట్ లాక్ చేస్తుందో అంటూ అక్కినేని అభిమానులతో పాటుగా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇంతలో ఏజెంట్ కి రీ ఎడిటింగ్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఏజెంట్ లోని అనవసరపు సన్నివేశాలను, ల్యాగ్ అయిన యాక్షన్ సీక్వెన్స్ ని ఎడిట్ చేశారని, ఇందులో ఎన్నో మార్పులు చేసి కొత్త వెర్షన్‌ ఏజెంట్ ని ఓటిటీ కోసం రెడీ చేస్తున్నారని అంటున్నారు.

ప్రస్తుతం ఏజెంట్ రీ ఎడిటింగ్ ఓ కొలిక్కి రాబోతుంది అని.. జూన్ 23వ తేదీ నుంచి సోనీ లివ్‌లో ఏజెంట్ స్ట్రీమింగ్ అవబోతుందని తాజాగా తెలుస్తోంది. ఈ తేదీని త్వరలోనే అధికారికంగా తెలియజేస్తారని సమాచారం.

Finally, the Agent coming into OTT:

Akhil Akkineni Agent to now stream on SonyLIV on June 23
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs