Advertisement
Google Ads BL

ఫుల్ స్వింగ్ లో పవన్ కళ్యాణ్ OG


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో భాగంగా వారాహి యాత్రకి రెడీ అవుతున్నారు. ఈ మధ్యలో ఆయన చెయ్యాల్సిన షూటింగ్స్ చకచకా ఫినిష్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా సముద్ర ఖని దర్శకత్వంలో మొదలు పెట్టిన BRO ని విడుదలకి సిద్ధం చేసిన పవన్ కళ్యాణ్.. దానయ్య ఎంటర్టైన్మెంట్ లో సుజిత్ దర్శకతంలో చేస్తున్న OG షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నారు. ముందుగా ముంబై, పూణే పరిసర ప్రాంతాల్లో మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసారు.

Advertisement
CJ Advs

తర్వాతి షెడ్యూల్ ని రీసెంట్ గానే హైదరాబాద్ లో పూర్తి చేసారు. ఇక ఈ రెండు షెడ్యూల్స్ తర్వాత పవన్ కళ్యాణ్ రిలాక్స్ అవకుండా ఉస్తాద్ సెట్స్ లోకి వెళతారు, లేదంటే హరి హర వీరమల్లు సెట్స్ లోకి అయినా వెళతారని భావించినా.. పవన్ కళ్యాణ్ మాత్రం OG మూడో షెడ్యూల్ లో జాయిన్ అయ్యి మిగతా మేకర్స్ కి షాకిచ్చారు. OG మూడో షెడ్యూల్ నేటి నుండి హైదరాబాద్ లో మొదలైనట్లు మేకర్స్ వెల్లడించారు. త్వరలో ఈ షూటింగ్ లోకి పవన్ కళ్యాణ్ చేరనున్నట్లు తెలిపారు. 

The heat begins again, both on and off the set. ☀️⭐️ The third schedule has kickstarted today in Hyderabad, and #OG will join us in a few days. 🔥🤗 

#FireStormIsComing 🔥 అంటూ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది.

ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ చిత్రాన్ని త్వరగా కంప్లీట్ చేసేసి డిసెంబర్ లో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. అతి త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నట్లుగా సమాచారం.

Pawan Kalyan OG in full swing:

Pawan Kalyan OG next schedule update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs