Advertisement
Google Ads BL

అమ్మాయిని పరిచయం చేసిన కెవ్వు కార్తీక్


జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఎట్టకేలకి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. జబర్దస్త్ లోకి వచ్చి కామెడీ చేస్తూ టీమ్ లీడర్స్ గా సెటిల్ అయ్యి కార్లు, కొత్త ఇల్లు కొనుక్కుని తమ ఫామిలీస్ ని సెటిల్ చేసి.. అవకాశం ఉన్నప్పుడు వెండితెర మీద లక్కు పరీక్షించుకుంటూ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న కమెడియన్స్ చాలామంది పెళ్లి మాత్రం లేట్ గా చేసుకుంటున్నారు. ముఖ్యంగా సుధీర్, ఆది, కార్తీక్ లాంటి వాళ్ళు ఇంకా పెళ్లిళ్లు చేసుకోలేదు. జీవితంలో ఎన్నో కష్టాలతో సఫర్ అయిన కెవ్వు కార్తీక్ పెళ్లి చేసుకోటానికి రెడీ అయ్యాడు.

Advertisement
CJ Advs

రీసెంట్ గానే తన లైఫ్ లోకి ఎంటర్ కాబోతున్న అమ్మాయి గురించి చెప్పి, ఆమె ఫేస్ కనిపించకుండా, అమ్మాయి వివరాలు బయటపెట్టకుండా సస్పెన్స్ క్రియేట్ చేసాడు. తన లైఫ్ లో ఆమె రాక కోసం చాలా వెయిట్ చేస్తున్నా అంటూ సోషల్ మీడియా ద్వారా పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని రివీల్ చేసాడు. తాజాగా తాను ఎవరిని చేసుకోబోతున్నానో అనేది ఆమె ఫేస్ రివీల్ చేస్తూ ఆ అమ్మాయిని అందరికి పరిచయం చేసాడు.

ఫైనల్ గా నేను చేసుకోబోయే అమ్మాయి. పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయంటారు. కానీ ఆ సమయంలో నాకు అర్ధం కాలేదు. రెండు భిన్నమైన మనసులు, భిన్నమైన మనస్తత్వాలు, భిన్న జీవితాలు, భిన్నమైన అభిప్రాయాలూ, విభిన్న ప్రపంచాలు జీవితమనే ప్రయాణంలో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించేందుకు ఒకే హృదయంగా మారుతున్నాయి. వెక్ కమ్ టు మై లైఫ్ సిరి అంటూ అమ్మాయితో పాటుగా తాను చేసుకోబోయే అమ్మాయి పేరుని రివీల్ చేసాడు. దానితో కెవ్వు కార్తీక్ కి ఆయన స్నేహితులు, తోటి కమెడియన్స్, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  

Kevvu Karthik introduced his future wife:

Jabardasth comedian Kevvu Karthik is getting married soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs