Advertisement
Google Ads BL

జబర్దస్త్ పంచ్ ప్రసాద్ కి సీరియస్


కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న జబర్దస్త్ పంచ్ ప్రసాద్ కి ప్రస్తుతం సీరియస్ గా ఉన్నట్లుగా కో కమెడియన్ నూకరాజు ఓ వీడియో ద్వారా వివరించాడు. పంచ్ ప్రసాద్ కి రెండు కిడ్నీస్ పడడంతో అతను కొన్నాళ్లుగా ట్రీట్మెంట్ తీసుకుంటూనే జబర్దస్త్ స్టేజ్ పై పంచ్ లు పేలుస్తూ కామెడీ చేస్తున్నాడు. అయితే కొద్దిరోజుల క్రితం మళ్ళీ పంచ్ ప్రసాద్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. కొన్నాళ్ళు అతను నడవలేకపోయాడు కూడా. భార్య కిడ్నీ మ్యాచ్ అయినా తర్వాత మళ్ళీ అవసరమైతే అతని కి కిడ్నీ అవసరం పడుతుంది అని.. వేరే డోనర్ ద్వారా ప్రయత్నం చెయ్యగా.. పంచ్ ప్రసాద్ కి కిడ్నీ డోనర్ దొరికారు.

Advertisement
CJ Advs

కానీ పంచ్ ప్రసాద్ కి కాలుకి ఇన్ఫెక్షన్ సోకడంతో ఆపరేషాన్ పోస్ట్ పోన్ అయ్యింది. కానీ ఇప్పుడు మరోసారి ప్రసాద్ అనారోగ్యం తిరగబెట్టడంతో పంచ్ ప్రసాద్ ని ఆసుపత్రిలో జాయిన్ చేసారు కుటుంబ సభ్యులు. అయితే కిడ్నీ ఆపరేషన్, కిడ్నీ ట్రాన్స్ఫలేంటేషన్ చెయ్యడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఫైనాన్సియల్ గా ప్రసాద్ ఫ్యామిలీ ఇప్పటికే సఫర్ అవుతుంది. అందుకే నూకరాజు ఆ వీడియో ద్వారా దాతలెవరైనా ఉంటే ప్రసాద్ కి సహాయం చెయ్యమని కోరుతున్నాడు.

నూకరాజు షేర్ చేసిన వీడియోలో పంచ్ ప్రసాద్ ఆక్సిజెన్ మాస్క్ తో ఉన్నాడు. ఆ మధ్యన పంచ్ ప్రసాద్ కిడ్నీ ఆపరేషన్ కోసం అయ్యే ఖర్చుని తానే భరిస్తాను అంటూ కిర్రాక్ ఆర్పీ మీడియాకి చెప్పాడు. మరి ఇప్పుడు అతనేం చేస్తాడో చూడాలి.

Jabardasth Comedian Punch Prasad Health Condition Is Serious:

 Punch Prasad Health Condition Is Serious, Waiting For Financial Help
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs