Advertisement
Google Ads BL

పవన్ ఆఫర్ - పట్టించుకోని రకుల్?


రకుల్ ప్రీత్ ని సౌత్ పక్కనబెట్టిందో.. లేదంటే రకుల్ ప్రీతే సౌత్ ని పట్టించుకోవడం లేదో కానీ.. ఆమెకి సౌత్ భాషల్లో అవకాశాలు బాగా తగ్గాయి. ఆమెకి స్టార్ డం తెచ్చిపెట్టిన తెలుగులో రకుల్ కనిపించి మూడేళ్లు అవుతుంది. స్పైడర్ తర్వాత చాన్నాళ్ళకి కొండపొలం చేసింది. అది కూడా రకుల్ ని నిరాశ పరిచింది. తర్వాత రకుల్ హిందీలో బిజీ అయ్యింది. ప్రస్తుతం తమిళంలో ఇండియన్ 2 లో నటిస్తుంది.

Advertisement
CJ Advs

అయితే రకుల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూవీ అవకాశం కాలదన్నుకుంది అనే న్యూస్ చూసిన ఫాన్స్ పవన్ సినిమానే వద్దనుకునే స్టేజ్ కి వెళ్లిపోయిందా రకుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు విషయమేమిటంటే పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కలయికలో తెరకెక్కుతున్న బ్రో మూవీలో స్పెషల్ సాంగ్ కోసం ముందుగా తమన్నా, శృతి హాసన్ ని అనుకున్నా చివరికి ఆ అదృష్టం రకుల్ ని వరించింది. రకుల్ కూడా ఈ ఆఫర్ కి సానుకూలంగా ఉంది అన్నారు. బ్రో షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది.

ఇక ఈ స్పెషల్ సాంగ్ బ్యాలెన్స్ ఉండగా.. దాని షూటింగ్ కూడా ఓ సెట్ వేసి ప్లాన్ చేసుకున్నారు సముద్రఖని వాళ్ళు. అన్నీ పూర్తయ్యి సాంగ్ సెట్స్ మీదకి వెళ్లే సమయానికి రకుల్ ప్రీత్ తనకి డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదని.. సో తనకి సమయం కావాలంటూ బ్రో యూనిట్ కి మెసేజ్ పెట్టిందట. మరి పవన్ కళ్యాణ్ డేట్స్ ఎంత వాల్యుబుల్లో అందరికి తెలుసు. కానీ రకుల్ ఇలా హ్యాండ్ ఇచ్చేసరికి ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియక.. చిత్ర బృందం తలపట్టుకుంది.

రకుల్ కోసం వెయిట్ చేస్తే పవన్ కళ్యాణ్ డేట్స్ దొరకడం కష్టం. లేదంటే ఆ ప్లేస్ లోకి వేరే హీరోయిన్ ని చూడాలా అనే ఆలోచనలో బ్రో చిత్ర బృందం ఉన్నట్లుగా తెలుస్తుంది. 

Rakul Preet Quit From BRO Special Song?:

 Rakul Preet Singh Quit From Pawan BRO Special Song?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs