Advertisement
Google Ads BL

ఈ ఫ్రైడే రిలీజెస్.. రివ్యూస్.. రిజల్ట్స్


గత వారం వలనే ఈ వారం కూడా అన్నీ చోట మోటా సినిమాలే థియేటర్ బాట పట్టాయి. బాక్సాఫీసు వద్ద వాటి ఫేట్ ఏమిటో టెస్ట్ చేసుకున్నాయి. ఈ ఫ్రైడే రిలీజెస్ లో అంతో ఇంతో ఆకర్షించినవి మనం ప్రస్తావించాల్సినవి ముఖ్యంగా నాలుగు సినిమాలే. విశేషమేమిటంటే ఈ నాలుగు కూడా ఎప్పుడో మొదలై, అప్పుడెప్పుడో పూర్తయ్యి, ఎప్పుడెప్పుడు బరిలోకి దిగే దారి దొరుకుతుందా అని వేచి చూస్తూ నేటికీ బయటపడ్డవి. మరి వీరికి ప్రేక్షకుల నుంచి ఏ విధమైన స్పందన వచ్చిందో, ఎలాంటి ఫలితం దక్కిందో ఈ మినీ సమీక్షలో చూద్దాం.

Advertisement
CJ Advs

అహింస:

ప్రేమ కథలు తెరకెక్కించే స్పెషాలిటీ.. కొత్త వారిని పరిచయం చేస్తాడని క్రెడిబిలిటీలతో నేటికీ కెరీర్ నెట్టుకొచ్చేస్తున్న తేజ తాజాగా మలిచిన చిత్రం అహింస. మూవీ మొఘల్ రామానాయుడు మనవడు, అగ్ర నిర్మాత సురేష్ తనయుడు, హీ మ్యాన్ రానా సోదరుడు దగ్గుబాటి అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తూ తేజ తీసిన ఈ సినిమాకి అహింస అనే టైటిల్ అయితే పెట్టారు కానీ.. తెరపై మాత్రం హింసే ఎక్కువుగా కనిపించిందని, ఆ కంగాళీ కథనం ప్రేక్షకులని హింసించిందని టాక్ వినిపిస్తోంది. అసలేమాత్రం కొత్తదనం లేని ఈ కథని అభిరామ్ డెబ్యూ ఫిల్మ్ గా ఎలా యాక్సెప్ట్ చేసారో సురేష్, వెంకటేష్, రానాలకే తెలియాలి. ఇంకా అవే మూస కథలతో ప్రయత్నిస్తే ఎప్పటికీ మరో జయం పొందలేనని తేజ తెలుసుకోవాలి.

నేను స్టూడెంట్ సర్:

స్వాతి ముత్యంలా వచ్చినప్పుడు సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున ధాటికి భంగపాటు ఎదురైంది బెల్లంకొండ గణేష్ కి. ఈసారి నేను స్టూడెంట్ సర్ అంటూ చిన్న సినిమాలతో పోటీపడుతూ ప్రేక్షకులని పలకరించాడు. కథల ఎంపికలో తనకి కాస్త మంచి సెన్స్ ఉందని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. మొదటినుంచి పబ్లిసిటీ కంటెంట్ లో ఐ ఫోన్ నేపథ్యంలో సాగే క్రైం థ్రిల్లర్ గా ప్రొజెక్ట్ అవుతూ వచ్చిన నేను స్టూడెంట్ సర్ అందుకు తగ్గ కథతోనే రూపొందినప్పటికీ దర్శకుడి అనుభవరాహిత్యం ఆశించిన ఫలితాన్ని పూర్తి స్థాయిలో అందకుండా చేసింది. అయితేనేం ర్యాంక్ మిస్సయినా పాస్ మార్కులు పడ్డాయనేది ట్రేడ్ రిపోర్ట్.

పరేషాన్:

తెలంగాణ కల్చర్ తో కథలు తయారు చేస్తూ, తెలంగాణ స్లాంగ్ తో అందరిని ఆకట్టుకుంటూ వచ్చిన పలు చిన్న సినిమాలు పెద్ద హిట్స్ అంటూ ఉంటే మనం కూడా అదే పని చేసేద్దామనే ఆరాటంతో తీసిన ఆఫ్ బేకెడ్ ఫిల్మ్ పరేషాన్ అంటున్నారు విశ్లేషకులు. సినిమాలో పలు చోట్ల ఫన్ బాగానే వర్కౌట్ అయినా, ఆర్టిస్టులు కూడా సిన్సియర్ గానే ఎఫర్ట్ పెట్టినా.. ఈ సినిమాపై నెగిటివిటి రావడానికి కారణం దర్శకుడి శృతి మించిన ధోరణే. తెలంగాణ నేపథ్యం అంటే తాగుడు తప్పనిసరి అన్నట్టు పదే పదే అందరిని మందుబాబుల్లాగే చూపించడం వీక్షకులని విసిగించింది. అలాగే పంచ్ లు పేల్చాలనే తాపత్రయంలో దర్శకుడికి స్క్రిప్ట్ పట్ల సిన్సియారిటీ లోపించింది. ఓ వైపు తన తమ్ముడి సినిమా రిలీజ్ అంటున్నా ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరించి రిలీజ్ కి సహకరించిన రానాకి పరేషాన్ టీం ఆ టైటిల్ నే గిఫ్ట్ గా ఇచ్చింది.

చక్రవ్యూహం ద ట్రాప్:

జనరల్ గా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, మోస్ట్ అండర్ రేటెడ్ ఫిల్మ్, అండర్ రేటెడ్ యాక్టర్ అనే టాపిక్స్ ఈ వీక్ రిలీజ్ అయిన సినిమాల్లో నిజానికి ఆ ట్యాగ్ ఈ సినిమాకివ్వాలి అంటున్నారు చూసిన ప్రేక్షకులు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగే మర్డర్ మిస్టరీని చక్రవ్యూహం అనే టైటిల్ కి తగ్గట్టే మంచి ట్విస్ట్ లతోనే మలిచాడంట దర్శకుడు. అయితే ఇక్కడ అనుభారాహిత్యమే ఆటంకంగా మారింది. సినిమా టోటాలిటీ పట్ల ప్రభావం చూపించింది. ఓటిటిలో మాత్రం ఖచ్చితంగా మంచి స్పందన కనిపిస్తుంది అనేది క్రిటిక్స్ రిపోర్ట్.

తరచుగా చిన్న సినిమాల నిర్మాతల నుంచి వాళ్ళకి రిలీజ్ డేట్ దొరకట్లేదనో, ధియేటర్లు ఇవ్వట్లేదనో అనే కంప్లైంట్ వింటూ ఉంటాం. ఇప్పుడదే డేటు, థియేటర్లు కలిసొచ్చి ఈ నిర్మాతలపై కంప్లైంట్ ఇవ్వాలా అనేలా ఉన్నాయి ఈమధ్యన వస్తోన్న చిన్న సినిమాల ఫలితాలు. సాకులు చెప్పడంలో చూపించే శ్రద్దలో సగం సరైన కథని ఎంచుకోవడంలో చూపించినప్పుడే మనకి మంచి కంటెంట్ కనిపించడం మొదలవుతుంది. కంప్లైంట్స్ వినిపించడం ఆగిపోతుంది. మొత్తానికైతే మంత్ ఫస్ట్ వీక్ లోనే బెస్ట్ డేట్ దొరికినా ఏ ఒక్క సినిమా కూడా గట్టిగ సత్తా చాటలేకపోయింది. దానితో  ఈ వారం కూడా థియేటర్లకు భారమే మిగిలింది.

This Friday Releases.. Reviews.. Results:

Today Releases.. Reviews.. Results
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs