Advertisement
Google Ads BL

బాలయ్య బర్త్ డే.. బ్లాక్ బస్టర్ రీ రిలీజ్


హీరోల బర్త్ డే లకి వాళ్ళు నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల రీ రిలీజ్ లు, అలాగే వాళ్ళు నటిస్తున్న సినిమాల నుండి లేటెస్ట్ అప్ డేట్స్ వదలడం.. ఇపుడు ఇదే ట్రెండ్ టాలీవుడ్ లో నడుస్తుంది. యంగ్ హీరోలు లేదు.. సీనియర్ హీరోలు లేదు, మీడియం హీరోలు లేదు.. ఇలా ఏ హీరో బర్త్ డే అయినా ఇప్పుడు ఇలాంటి ఏర్పాట్లే జరుగుతున్నాయి. మేకర్స్ కి కాసులు, అభిమానులకి ఆనందం. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ బర్త్ డేకి సింహాద్రి రీ రిలీజ్ అయ్యింది.

Advertisement
CJ Advs

ఇప్పుడు నందమూరి నటసింహ బాలకృష్ణ బర్త్ డే జూన్ 10 కి రాబోతుంది. అదే రోజు ఆయన నటిస్తున్న NBK108 టైటిల్ ని రివీల్ చెయ్యడానికి అనిల్ రావిపూడి రెడీ అంటుంటే.. నెక్స్ట్ మూవీ అప్ డేట్ పై నందమూరి అభిమానులు ఆసక్తితో ఉన్నారు. ఇక ఆయన కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన నరసింహ నాయుడు మూవీని రిలీజ్ చెయ్యబోతున్నారు మేకర్స్. బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాలయ్య కేరీర్లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇప్పుడు ఇదే చిత్రాన్ని ఆయన బర్త్ డే సందర్భంగా HD లో విడుదల చేస్తున్నారు. నందమూరి ఫాన్స్ నరసింహ నాయుడు రీ రిలీజ్ రికార్డులు సృష్టించడానికి రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే ఖుషి-సింహాద్రి రీ రిలీజ్ కలెక్షన్స్ పై సోషల్ మీడియాలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆ లెక్కలన్నీ పాడుకోబెట్టేయాలని నందమూరి ఫాన్స్ రెడీ అవుతున్నారు.

Narasimha Naidu movie re releasing :

Narasimha Naidu movie re releasing on Nandamuri Balakrishna birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs