Advertisement
Google Ads BL

పెళ్ళికి సిద్ధమైన జబర్దస్త్ కమెడియన్


జబర్దస్త్‌లో చాలామంది కామెడీ ద్వారా పాపులర్ అయ్యారు. అందులో తనదైన తరహా కామెడీతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన కెవ్వు కార్తీక్ ఎన్నో ఏళ్లగా జబర్దస్త్‌లో కనిపిస్తున్నాడు. వెండితెరపై చిన్న చిన్న కేరెక్టర్స్‌తో హైలెట్ అవుతున్న కెవ్వు కార్తీక్ తన తల్లి ఆరోగ్యం విషయంలో ఎంతగా సఫర్ అయ్యాడో అనేది చాలాసార్లు చాలా సందర్భాలలో చెప్పుకొచ్చాడు. ఎంటెక్ చేసి ఉద్యోగం సంపాదించిన కెవ్వు కార్తీక్.. సినిమా ఇండస్ట్రీపై ఇంట్రెస్ట్‌పై జాబ్ వదిలేసి.. ఇపుడు బుల్లితెర మీద జబర్దస్త్ స్టేజ్ ద్వారా ఫేమస్ అయ్యాడు.

Advertisement
CJ Advs

అయితే ఫ్యామిలీని అమితంగా ప్రేమించే కార్తీక్ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడవుతాడా? అని కామెడీ ప్రియులు, అతని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే త్వరలోనే కెవ్వు కార్తీక్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ శుభవార్తను కార్తీక్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నాడు. నా లైఫ్ లోకి కొత్త వ్యక్తి ఎంటర్ అయితే జీవితంలో హ్యాపీనెస్ రెట్టింపవుతుంది అనే విషయాన్ని కొంతమంది చెప్పారు. బహుశా అది నిజమేనేమో.. నా లైఫ్‌లోకి అడుగుపెడుతున్నందుకు థాంక్యూ. నీతో కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు ఎంతగానో వెయిట్ చేస్తున్నాను.

అంతేకాకుండా కెవ్వు కార్తీక్ తనకి కాబోయే అమ్మాయి ఫేస్ రివీల్ చెయ్యకుండానే.. అందరికి పరిచయం చేశాడు. ఆ అమ్మాయి అటుతిరిగి నిలబడగా. హార్ట్ సింబల్‌తో తన పెళ్లి విషయాన్ని కార్తీక్ కన్ఫర్మ్ చేశాడు. 

Jabardasth Comedian Kevvu Karthik Ready to Marriage:

Jabardasth Comedian Kevvu Karthik Confirmed his Marriage News
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs