మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి లు ఎప్పటినుండో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు రావడమే కానీ వారి స్పందన మాత్రం లేదు. మేము ప్రేమించుకుంటాన్నామని అసలు విషయం బయటపెట్టకుండానే ఇప్పుడు నిశ్చితార్దానికి రెడీ అయ్యారు.. అనే న్యూస్ గత 20 రోజులక్రితం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఎప్పటినుండో ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు ఫైనల్లీ ఇరు కుటుంబాల సమక్షంలో పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కబోతున్నారట. జూన్ మొదటి వారంలో వీరి నిశ్చితార్ధమనే న్యూస్ తెగ చక్కర్లు కొట్టింది.
మధ్యలో నిహారిక మాత్రం వరుణ్ తేజ్ పెళ్లి ముచ్చట్లు చెప్పమంటే నా విషయాలడగండి చెబుతా అంటూ ఎగిరింది. ఇక ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా వరుణ్యా తేజ్-లావణ్య త్రిపాఠీల నిశ్చితార్ధనికి ఏర్పాట్లు జరగడమే కాకుండా.. దానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసారంటూ మరో న్యూస్ వినిపిస్తుంది.అదే ఈ నెల 9 అంటే జూన్ తొమ్మిదిన వరుణ్, లావణ్య త్రిపాఠీల పేరెంట్స్ అంటే ఇరు కుటుంబాల మధ్యన వీరి నిశ్చితార్ధం సింపుల్ గా జరగబోతుంది అంటున్నారు.
ఈమేరకు ఏర్పాట్లు కూడా ఇరు ఫామిలీస్ లో మొదలైయ్యాయని, నిశితార్ధాన్ని సింపుల్ గా ముగించేసి వరుణ్ పెళ్లిని అంగరంగ వైభవంగా చెయ్యాలని మెగా ఫ్యామిలీ చూస్తుందట.