నిన్నటినుంచి అంతటా సూపర్ స్టార్ హవా రన్ అవుతుండగా నేడు మెగా మేనియా కి తేర లేచింది. భోళా శంకర్ పాటల సందడిని ప్రారంభిస్తూ ఫస్ట్ లిరికల్ సాంగ్ అప్ డేట్ తో మెగా ఫ్యాన్సులో జోష్ తీసుకువచ్చారు నిర్మాత అనిల్ సుంకర. మహతి స్వర సాగర్ నేతృత్వంలో వింటేజ్ మెగా మార్క్ మ్యూజిక్ తో అదిరిపోయే ఆల్బమ్ గా తీర్చిదిద్దుతున్న భోళా శంకర్ నుంచి మొదటి లిరికల్ సాంగ్ జూన్ 4 వ తేదీన విడుదల కానుంది. అంతకు రెండు రోజుల ముందుగానే ఆ పెప్పీ సాంగ్ టేస్ట్ మనకు కాస్త తెలిపేలా జూన్ 2న... అంటే రేపే ఆ సాంగ్ ప్రోమో రానుంది.
మెగా బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్య తరువాత మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోతోన్న మరో మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్ టైనర్ భోళా శంకర్. తమిళ సూపర్ హిట్ వేదాళం రీమేక్ గా మెహెర్ రమేష్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరు సరసన కథానాయికగా తమన్నా, చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. కీలక పాత్రలో సుశాంత్ కనిపించనున్నారు. ఇక సినిమా అంతటా భారీ తారాగణమే కలిగి ఉన్న ఈ చిత్రానికి మెగాస్టార్ మాస్ మేనరిజమ్స్ మెయిన్ ఎస్సెట్ కానున్నాయి.
ఇప్పటికే భోళా శంకర్ గా చిరు లుక్ ఈ చిత్రానికి పాజిటివ్ బజ్ తీసుకొచ్చేసింది. ఇక సినిమాలోనూ చిరంజీవి తనదైన శైలి నటనతో చితక్కొట్టేశారని చెబుతున్నారు యూనిట్ మెంబర్స్. అలాగే మరోసారి శేఖర్ మాస్టర్ సూపర్ స్టైలిష్ స్టెప్స్ కంపోజ్ చేశారనీ, చిరు జోరుగా చెలరేగిపోయారని అంటున్నారు. రీసెంట్ గా చిరు - తమన్నాలపై స్విట్జర్లాండ్ లో షూట్ చేసిన రొమాంటిక్ సాంగ్ సూపర్బ్ గా వచ్చిందట. అలాగే మరో ఫంక్షన్ సాంగ్ కూడా కలర్ ఫుల్ గా కళకళగా ఉందట. ఇక ఇంట్రో సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందనీ, థియేటర్స్ ఊగిపోవడం తధ్యమనీ తెలుస్తోంది. ఇలా ఏ పాటకి ఆ పాటే హైలైట్ గా చెబుతోన్న భోళా శంకర్ మ్యూజికల్ ఫెస్టివల్ ని జరుపుకోవడానికి రేపటి నుంచే రెడీ అయిపోవచ్చు మెగా ఫాన్స్.!