Advertisement
Google Ads BL

ఆడియన్స్ చాలా తెలివైనోళ్లు - తేజ


వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ డైరెక్టర్ తేజ తాజాగా తెరకెక్కించిన చిత్రం అహింస. మూవీ మొఘల్ డా. డి. రామానాయుడు మనవడు, డి. సురేష్ బాబు తనయుడు, రానా సోదరుడు అయిన  అభిరామ్ అరంగేట్రం చేస్తున్నఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌ పై పి.కిరణ్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచింది. జూన్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో డైరెక్టర్ తేజ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

Advertisement
CJ Advs

సినీ నేపథ్యం వున్న వారిని పరిచయం చేసినప్పుడు ఎలాంటి సవాళ్లు వుంటాయి ?

రామానాయుడు గారి ఫ్యామిలీ లోని అబ్బాయితో చేశాం. ఇలా సినీ నేపథ్యంలో వున్న పెద్ద కుటుంబాలలోని వ్యక్తులతో చేసినప్పుడు సహజంగానే పోలికలు వస్తాయి. ప్రతీదీ భూతద్దం పెట్టి చూస్తారు. అభిరాం కొత్తగా వచ్చాడు. కొత్తవారిలో బెరుకు, భయాలు సహజంగా ఉంటాయి. కానీ ఈ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఇంకా ఎక్కువగా చూస్తారు. ఆల్రెడీ స్టార్స్ అయిన వెంకటేష్, రానాలతో పోలిక పెట్టి చూస్తారు. దీంతో వారందరినీ దాటి ముందుకు రావడం చాలా కష్టం.

కానీ ప్రేక్షకుల అటెన్షన్ వుంటుంది కదా ?  

ఏం ఉండదు. ప్రేక్షకులు చాలా తెలివైన వారు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాకి వెళ్ళాలా ? వద్దా ? అనేది డిసైడ్ అయిపోతారు. స్టార్ ని బట్టి వెళితే అసలు పెద్ద స్టార్స్ కి అపజయాలే రాకూడదు కదా. సినిమాలో ఎమోషన్ వుంటే ట్రైలర్ లో కనిపిస్తుంది.  ప్రేక్షకులు ఆ ఎమోషన్ కి కనెక్ట్ ఐతే స్టార్ సినిమానా, కొత్తవారిదా అనే తేడా లేకుండా వచ్చేస్తారు.  

ఇంతకుముందు మీరు పరిచయం చేసిన వారికి అభిరామ్ కి ఎలాంటి వ్యత్యాసం చూపించబోతున్నారు?

కథే చూపిస్తుంది. కథకు ఏం అవసరమో అది చేశాం. ఫలానా స్టార్ అబ్బాయి కాబట్టి ఫలానా ఎలిమెంట్స్ ఉండాలని నేను ఎప్పుడూ సినిమాలు చేయలేదు. కథ ఎటు తీసుకెళితే అటు వెళ్ళడమే నాకు తెలుసు.

అభిరామ్ ని పరిచయం చేయడనికి కారణం?

చాలా సార్లు చెప్పాను. నేను రామానాయుడు గారికి మాట ఇచ్చాను. ఆ మాట కోసమే చేశాను.

మీరు పెద్ద స్టార్స్ తో పెద్ద సినిమాలు చేయాలనే లెక్కలు వేసుకోరా ?

పెద్ద స్టార్స్ తో ఎక్కువ డబ్బులు కోసం, ఎక్కువ పేరు కోసం చేయాలి. నేను డబ్బులు, పేరు రెండూ చూశాను. నేను ఒకప్పుడు ఫుట్ పాత్ మీద వుండేవాడిని. ఓ కెమెరామెన్ దగ్గర డబ్బులు ఇచ్చినా,  ఇవ్వకపోయినా పని చేసేవాడిని. నా పని చూసి పుట్ పాత్ నుంచి వచ్చిన నాకు ఆయన బ్రేక్ ఇచ్చారు. నాలా చాలా మంది వున్నారు. చాలా ప్రతిభ వుండి కూడా ఎలా ఎంటర్  అవ్వాలో తెలీదు. వాళ్ళకి నేను బ్రేక్ ఇస్తాను. ఓ పెద్ద స్టార్ తో సినిమా చేసినా అందులోనూ కొత్తవారిని పెడతాను.

అహింసలో యాక్షన్ సీక్వెన్స్ లు ఎక్కువగా ఉంటాయని విన్నాం ?

అవును. ఇందులో దాదాపు 14 యాక్షన్ సీక్వెన్స్ లు వున్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కథలో వెళ్తుంటాయి. ఇందులో ఓ నాలుగు ఎపిసోడ్స్ కి నేనే ఫైట్ మాస్టర్ గా చేశాను.

ఇన్ని యాక్షన్ సీక్వెన్స్ ఉండటం కొత్త నటుడికి భారం కాదా?

తనకి వచ్చిన కష్టాలనుంచి బయటపడే ప్రయాణంలో యాక్షన్ సీక్వెన్స్ లు పెట్టాం తప్ప ఫలానా ఫైట్ లో వందమందిని కొట్టాలనే లెక్కలు వేసుకుని పెట్టలేదు. అది మనకి చేతకాదు కూడా (నవ్వుతూ). ఇది ఒక ఫిలాసఫీని బేస్ చేసి చేసిన కథ. అహింసా  వాదంపై సరైన క్లారిటీ లేదు. దేశంలో చాలా హింసాత్మక సంఘటనలు జరిగాయి. అహింసా  వాదాన్ని ఫాలో అయితే అవి జరగకూడదు. ఫాలో కాకపోవడానికి కారణం.. మనకి అది అర్థం కావడం లేదు. అసలు అది కరెక్టా కాదా,  దాన్ని ఎలా ఫాలో అవ్వాలి  అనే కాన్సెప్ట్  పట్టుకొని మంచి కమర్షియల్ కథే చేశాం.

మధ్యప్రదేశ్ అడవుల్లో షూట్ చేయడానికి కారణం ?

లోకేషన్స్ చాలా బాగున్నాయి. కొత్త లోకేషన్స్. ఇప్పటివరకూ ఏ సినిమాలో రాలేదు. కథ అనుకున్నప్పుడే విజువల్, ఆడియో, నేపథ్యం అన్నీ కొత్తగా ఉండాలని అక్కడ షూట్ చేశాం.

ఆర్పీ పట్నాయక్ తో చాలా కాలం తర్వాత మ్యూజిక్ చేయించారు ?

మ్యూజిక్ చాలా పవర్ ఫుల్. ఆ మ్యూజిక్ నుంచి కథ చెప్పడానికి ప్రయత్నిస్తుంటాను. ట్యూన్, లిరిక్స్ అన్నీ కథని ముందుకు తీసుకెళ్ళాలి. అందుకే భారం ఎక్కువగానే వేస్తాను. ఆర్పీ పట్నాయక్ మంచి పాటలు ఇచ్చారు. అనూప్ నేపథ్య సంగీతం చేశాడు. 

సురేష్ బాబు ఎప్పుడైనా సెట్స్ కి వచ్చారా ?

ఒకసారి వచ్చారు. నాన్న నువ్వు వుంటే నేను చేయను అన్నాడు అభి(నవ్వుతూ). ఇన్ని సినిమాలు చేసిన వెంకటేష్, రానాకి కూడా సురేష్ బాబు గారు సెట్ కి వస్తే ఒక టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే నిర్మాతగా ఆయన దృష్టి వేరుగా వుంటుంది.

రానా గారితో చేసే సినిమా ఎలా వుంటుంది ?

రాక్షస రాజు అనే టైటిల్ అనుకుంటున్నాం. పాలిటిక్స్, క్రైమ్ నేపథ్యంలో వుంటుంది. గాడ్ ఫాదర్ తరహా సినిమా. ఆచంట గోపీనాథ్ గారు దీనికి నిర్మాత. జూన్ 6 రామానాయుడు గారి పుట్టిన రోజు. ఆ రోజు నుంచి స్టార్ట్ చేద్దామని రానా అన్నారు.

మీరు ఒక ఎగ్జిబిటర్ కూడా.. ఇప్పుడు థియేటర్ బిజినెస్ ఎలా వుంది ? 

థియేటర్ బిజినెస్ బాగుంది. నిజానికి  థియేటర్ అమ్మేస్తే చాలా డబ్బులు వస్తాయి. బ్యాంకు లో వేసుకొని హాయిగా కూర్చోవచ్చు. నాకు అది ఇష్టం లేదు. నష్టమైనా లాభమైనా పని చేస్తూ ఉండాలి. స్టూడియో, థియేటర్ నాకు గుడి లాంటివి. ఈ గుడిలో మొదలై ఆ గుడిలో రిలీజ్ అవుతాయి. ఈ రెండు గుళ్ళ మధ్య సూపర్ స్టార్స్ తయారవ్వడం జరుగుతుంది. ఈ రెండు గుళ్ళని కాపాడుకోవాలి.

మీ లక్ష్యం ఏమిటి ?

అహింస విజయం సాధించి డబ్బులు వస్తే ఆ డబ్బుతో మళ్ళీ సినిమాలు తీస్తా. నా డైరెక్షన్ కాకుండా కొత్త దర్శకులని కొత్తరకం సినిమాలు తీసే దర్శకులని, ఇండస్ట్రీ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళే దర్శకులని తీసుకురావాలని నా కోరిక. రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం, శేఖర్ కమ్ముల, తేజ.. ఇలా అందరికీ ఒక్కొక్క స్టైల్ వుంది. ఇలా కొత్త స్టైల్ వుండే దర్శకులని పరిచయం చేయాలని నా కోరిక. దీని వలన మన తెలుగు సినిమా ఇంకా బెటర్ అవుతుంది.

Director Teja Interview about Ahimsa:

Director Teja Interview
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs