Advertisement
Google Ads BL

ప్రస్తుతానికి ఆ మూడ్ లేదు: ఆమిర్


కొన్ని నెలలుగా సినిమాలకి దూరంగా ఉంటున్న ఆమిర్ ఖాన్ మరికొద్ది రోజులు సినిమాలు చేయాలనుకోవడం లేదు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. లాల్ సింగ్ చద్దా తర్వాత ఆమిర్ ఖాన్ నుండి కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ రాకపోయినా.. వ్యక్తిగత జీవితంలో భార్యతో విడిపోవడం.. అలాగే కొద్దిరోజులపాటు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను అందుకే సినిమాలకు దూరంగా ఉన్నాను అని అమిర్ ఖాన్ ఎప్పుడో చెప్పారు. ఈమధ్య కాలంలో మీడియాకి ఎక్కువ కనిపించని ఆయన తాజాగా మూడో పెళ్లి చేసుబోతున్నాడనే న్యూస్ వైరల్ అయ్యింది.

Advertisement
CJ Advs

నటి ఫాతిమా సనాని ఆమిర్ ఖాన్ వివాహం చేసుకోబోతున్నాడనే న్యూస్ బాలీవుడ్ మీడియా సర్కిల్స్‌లో నడుస్తుంది. అదలా ఉంటే అమిర్ ఖాన్ తాజాగా ఓ ఈవెంట్ కి అతిధిగా హాజరు కాగా.. ఆయన అక్కడ మాట్లాడుతూ కొద్దిరోజులపాటు సినిమాల నుండి విశ్రాంతి తీసుకోవాలనుకున్నాను, ప్రస్తుతం నా కుటుంబంతో సమయాన్ని గడుపుతూ సంతోషంగా ఉన్నాను, ప్రసుతం ఏ సినిమాలో నటించే ఇంట్రెస్ట్ లేదు, అందుకే వర్క్‌కి దూరంగా ఉన్నాను.

లాల్ సింగ్ చద్దా తర్వాత నేను నటించబోయే సినిమా ఏమిటో తెలుసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. తదుపరి ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ హ్యాపీగా ఉన్నాను, ఎమోషనల్‌గా సిద్దమైనప్పుడు ఏ సినిమా చేస్తున్నానో చెబుతాను అంటూ అమిర్ ఖాన్ సినిమాలకి ఎందుకు దూరంగా ఉంటున్నాడనే విషయమై మరోసారి క్లారిటీ ఇచ్చారు.

Aamir Khan Breaks Silence about his Upcoming Project:

Reason Behind Aamir Khan Stopped Shootings
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs