Advertisement
Google Ads BL

న్యాయమూర్తుల మీదనే అవినీతి ఆరోపణలా?


అవినాష్ రెడ్డి బెయిల్ ఇస్తూ హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేసారు. ఈనెల 26న కొన్ని ఛానెళ్లలో జరిగిన పాల్గొని న్యాయమూర్తుల మీద అవినీతి ఆరోపణలు చేసిన సస్పెండ్ అయిన జడ్జి రామ కృష్ణ మీద తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అవినాష్ కేసు విషయంలో హైకోర్టు జడ్జీలకు డబ్బు సంచులు వెళ్లాయని, అందుకే అయన అరెస్ట్ కావడం లేదని రామకృష్ణ (గతంలో సస్పెండ్ అయినా జడ్జి) వ్యాఖ్యలు చేసారు.. ఇదంతా ఆ ఛానెళ్లలో ప్రసారం అయింది. ఈ ఆరోపణలను నేడు కోర్టు తీవ్రంగా పరిగణించింది. దీంతో ఆ ఛానెళ్లలో జరిగిన చర్చలు, ఆ వీడియో ఫుటేజీ మొత్తం తమ ముందు ఉంచాలని హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్ హైకోర్టు రిజిస్ట్రార్ ను ఆదేశించారు. కేవలం హైకోర్టు న్యాయమూర్తులు డబ్బు సంచులు తీసుకుని అవినాష్ ను అరెస్ట్ చేయకుండా సీబీఐ నించి కాపాడుతున్నారని ఆరోజు టివి డిబేట్లలో సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణ ఆరోపణలు చేసారు. ఈ చర్చల్లో పాల్గొన్న కొందరు పాత్రికేయులు సైతం రామకృష్ణ చేసిన వ్యాఖ్యలకు భాష్యం చెప్పారు. ఏబీఎన్ ఛానెల్లో జరిగిన ఈ డిబేట్ లో బిజెపి నాయకుడు విల్సన్, మాజీ జడ్జి రామకృష్ణ పాల్గొనగా చర్చను యాంకర్ వెంకట కృష్ణ నిర్వహించారు. అయితే ఈ విషయంలో హైకోర్టు న్యాయమూర్తి ఎం. లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమకు మీడియా అంటే గౌరవం ఉందని, కానీ ఆరోజు తమ మీద అలాంటి వ్యాఖ్యలు చేయడంతో తాము కలత చెందామని న్యాయమూర్తి ఆవేదన చెందారు. అంతే కాకుండా దీన్ని తెలంగాణ హైకోర్టు తీవ్రంగా పరిగణించి ఆ వీడియో ఫుటేజీ మొత్తం డౌన్లోడ్ చేసి తమకు ఇవ్వాలని ఆదేశించడం ఇప్పుడు సంచలనం అయింది.

Advertisement
CJ Advs

తమకు అనుకూలంగా వస్తే ఒక విధంగా లేకుంటే మరోలా.. ఇప్పటికే కోర్టులు, న్యాయమూర్తుల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన 22 మంది మీద సీబీఐ కేసులు పెట్టింది. కొందరు అరెస్ట్ అవగా ఇంకా కొన్ని కేసులు విచారణ దశలో ఉన్నాయి. మరి వివేకా హత్యకేసును నేరుగా సీబీఐ దర్యాప్తు చేస్తుండగా ఆ కేసు తరచూ హైకోర్టులో విచారణకు వస్తున్నది. ఇరుపార్టీలు వాదోపవాదాలు చేస్తున్నాయి. మరి అలాంటి అంశం మీద, నేరుగా హైకోర్టు న్యాయమూర్తుల మీద లంచాలు, డబ్బు మూటలు తీసుకుని అవినాష్ రెడ్డికి సహకరిస్తున్నారు అని ఓ మాజీ జడ్జి వ్యాఖ్యలు చేయడం, ఆ కామెంట్లను టివి చానెళ్లు ప్రోత్సహించడం అంటే నేరుగా ఆ చానెళ్లు సైతం కోర్టుల మీద అలాంటి ఆరోపణలు చేస్తున్నట్లు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ఆ కేసులో అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ కి అనుకూలంగా కోర్టులు ఉత్తర్వులు ఇస్తే న్యాయమూర్తులు గొప్పగా వ్యవహరించారని, నిందితులకు సరైన గుణపాఠం తప్పదని గంటలకొద్దీ చర్చలు నడిపే ఈ చానెళ్లు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ దక్కగానే నేరుగా న్యాయమూర్తుల మీద అవినీతి ఆరోపణలు చేసే స్థాయికి దిగజారిపోయారు. కోర్టుల మీద ఆరోపణలు చేయరాదని సదరు టివి చేనేళ్ళలో డిబేట్లు నడిపిన సీనియర్ జర్నలిస్ట్ వెంకట కృష్ణకు తెలియదా? కోర్టులో జడ్జిగా పని చేసి ఫోర్జరీ కేసులో దొరికి సస్పెండ్ అయిన రామకృష్ణకు తెలియదా? ఇప్పుడు ఈ ఛానెళ్ల మీద కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి అంటున్నారు.

Allegations of corruption on judges?:

Allegations of corruption on judges?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs