అఖిల్ అక్కినేని ఏజెంట్‌తో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో కనిపించాడు. స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి అఖిల్‌కి ఏజెంట్ పక్కా హిట్ ఇస్తాడని అనుకున్నారు. అనిల్ సుంకర కూడా ఆలోచించకుండా నాగార్జున కొడుకు అఖిల్‌పై పెట్టుబడి పెట్టాడు. కానీ ఎవరి ఆలోచనలకు అందకుండా ఏజెంట్ డిజాస్టర్ అయ్యి కూర్చుంది. అలాంటి ఇలాంటి డిజాస్టర్ కాదు.. అఖిల్ కెరీర్‌లోనే ఘోరమైన డిజాస్టర్‌గా ఏజెంట్ నిలిచిపోయింది.
అయితే ఈ ప్లాప్ సినిమాని డిజిటల్ హక్కులు దక్కించుకున్న ఓటిటీ పార్ట్‌నర్ సోని లివ్ మూడు వారాలు తిరక్కుండానే ఓటీటీ స్ట్రీమింగ్ అంటూ పోస్టర్ వేసి ప్రకటించింది. కానీ అనుకున్న తేదీకి సోని లివ్ నుండి ఏజెంట్ రాలేదు. దానితో ఫాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. అయితే ఈ వారమైనా సోని లివ్ ఏజెంట్‌ని స్ట్రీమింగ్ చేస్తుంది అనుకుంటే.. ఈ వారం కూడా స్కిప్ చేసేసింది. దాంతో అఖిల్ ఏజెంట్ పై మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అఖిల్ ఏజెంట్‌ని ఓటీటీలో విడుదల చేసేందుకు మళ్ళీ ఎడిటింగ్ చేస్తున్నారని.. ఎక్కడెక్కడ అతిగా ఉందో దానిని ట్రిమ్ చేస్తున్నారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. థియేటర్స్‌లో ప్లాప్ అయిన ఏజెంట్‌ని ఓటీటీలో విడుదల చేసేందుకు ఎడిటింగ్ చేస్తూ మార్పులు చేస్తున్నారంటే ప్రేక్షకుల్లో ఏమైనా ఇంట్రెస్ట్ పెరుగుందేమో చూడాలి.