సూపర్ స్టార్ మహేష్ మానియా మళ్ళీ మొదలైంది. తాజాగా విడుదల చేసిన SSMB 28 మాస్ పోస్టర్ చూసి మహేష్ ఫాన్స్ ఊగిపోతున్నారు.. నెటిజన్లు వావ్ అంటున్నారు. చుట్టూ ముట్టడించిన ముష్కర మూకలతో తలపడేందుకై తలపాగా చుట్టుకుంటూ తీక్షణమైన చూపులతో సిద్ధమవుతోన్న మహేష్ లుక్ మామ్మూలుగా లేదు అంటూ యునానిమస్ గా వండ్రఫుల్ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ పోస్టర్ లో కూడా టైటిల్ రిలీజ్ చేయకుండా సూపర్ ఫాన్స్ ని ఈ రోజు ఈవెనింగ్ వరకు వెయిటింగ్ లోనే ఉంచారు దర్శకుడు త్రివిక్రమ్.
ప్రతి సంవత్సరం తండ్రి నటశేఖర కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31 న తన కొత్త చిత్రం తాలూకు అప్ డేట్ తో అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చే మహేష్ బాబు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నేడు ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని SSMB 28 టైటిల్ తో సహా మహా మాస్ స్ట్రైకింగ్ గ్లిమ్ప్స్ అందించనున్నారు. కృష్ణ గారి ఆల్ టైమ్ క్లాసిక్ మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని నేడు గ్రాండ్ గా రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ థియేటర్స్ తో పాటు ఎంపిక చేసిన మరికొన్ని థియేటర్స్ లో నేటి సాయంత్రం SSMB 28 గ్లిమ్ప్స్ ప్రొజెక్షన్ ప్లాన్ చేసారు. ముఖ్యంగా మహేష్ సూపర్ సెంటిమెంట్ థియేటర్ సుదర్శన్ 35 ఎంఎం (హైదరాబాద్)లో ఈ గ్లిమ్ప్స్ లాంచ్ ఈవెంట్ భారీ వేడుకలతో జరుగనుంది.
మహేష్ - త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ లో హ్యాట్రిక్ ఫిలింగా రానున్న ఈ చిత్రంలో డస్కీ బ్యూటీ పూజ హెగ్డే, ఛార్మింగ్ బ్యూటీ బ్యూటీ శ్రీలీల హీరోయిన్స్ గా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ నేడు రిలీజ్ కానున్న గ్లిమ్ప్స్ కి నెక్సెట్ లెవెల్ BGM ఇచ్చారని తెలిసింది. అంతేకాదు ఈ సినిమా పాటలు కూడా మహేష్ ఫాన్స్ కి మహా కిక్కిచ్చే రేంజ్ లో వస్తున్నాయని టాక్. ఎంతయినా ప్రీవియస్ ఫిలిం ఆల వైకుంఠపురంలో చిత్రం తో జాతీయ అవార్డు పొందిన కలయిక కదా త్రివిక్రమ్ - థమన్ లది.!
ఇప్పటికైతే ఈ స్పెషల్ పోస్టర్ తో సంబరాలు చేసుకుంటున్న మహేష్ ఫాన్స్ సాయంత్రం గ్లిమ్ప్స్ చూసాక ఏ స్థాయిలో స్పందిస్తారో, ఎంతటి సందడి చేస్తారో ఈవెనింగ్ అప్ డేట్ లో చూద్దాం.