Advertisement
Google Ads BL

NBK108 కి పవర్ ఫుల్ టైటిల్


నందమూరి నటసింహ బాలకృష్ణ-అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కుతున్న NBK108 షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. బాలకృష్ణ ఈ మధ్యన మహానాడు కోసం మూడునాలుగు రోజుల పాటు NBK108 షూటింగ్ నుండి బ్రేక్ తీసుకున్నా మళ్ళీ ఇప్పుడు ఆయన షూటింగ్ లో పాల్గొంటున్నారు. దసరాకి బాక్సాఫీసు దగ్గర పోటీ పడేందుకు రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Advertisement
CJ Advs

అయితే జూన్ 10 బాలయ్య బర్త్ డే కి NBK108 టైటిల్ తో పాటుగా పవర్ ఫుల్ గ్లిమ్ప్స్ విడుదల చేసేందుకు అనిల్ రావిపూడి రెడీ అవుతున్నాడట. ఈ చిత్రానికి భగవత్ కేసరి- ఐ డోంట్ కేర్ టైటిల్ పెడుతున్నట్లుగా.. ఇదే టైటిల్ ని NBK108 కోసం రిజిస్టర్ చేయించినట్లుగా తెలుస్తుంది. ఫైనల్ గా ఈ టైటిల్ ని ఫిక్స్ చేసి పవర్ ఫుల్ పోస్టర్ అలాగే, గ్లిమ్ప్స్ తో కలిసి రివీల్ చేస్తారని తెలుస్తుంది.

ఈ చిత్రంలో బాలయ్యకి కూతురుగా శ్రీలీల కనిపించబోతుండగా.. బాలయ్య-శ్రీలీల మధ్యలో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ చేత క్లాప్స్ కొట్టిస్తాయని ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు పెంచేస్తున్నారు. హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ కనిపించబోతున్నారు.

NBK108 to get this powerful title:

Balakrishna to say Bhagavath Kesari- I Don’t Care
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs