అల్లు ఫ్యామిలీ-మెగా ఫ్యామిలీ మధ్యలో ఏదో ఉంది వాళ్ళకి వాళ్ళకి పడదంటూ మీడియాలో వార్తలు రావడం తరుచూ చూస్తూనే ఉంటాము. కానీ వాళ్ళు ఎప్పుడు కలిసి కనిపించినా ప్రేమగానే ఉంటారు. ఒకరింటికి ఒకరు వెళుతూ సరదాగానే కనిపిస్తారు. కానీ రామ్ చరణ్ బర్త్ డే కి అల్లు అర్జున్ సోషల్ మీడియాలో విష్ చేయకపోవడమే కాకుండా.. రామ్ చరణ్ బర్త్ డే పార్టీని స్కిప్ చేసి భార్యతో విదేశాలకి వెళ్లడంపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి.
అందరికి తెలిసేలా విష్ చేస్తేనే వారి మధ్యన ప్రేమ ఉన్నట్టా.. లేదంటే వాళ్ళ మధ్యన తగువులు ఉన్నట్టా అని చాలామంది ప్రశ్నించినా ఈ విమర్శలు ఆగలేదు. తాజాగా రామ్ చరణ్ అల్లు శిరీష్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెప్పాడు. Wishing you lots of happiness and a great year ahead @AlluSirish Happy Birthday 😊 అంటూ రామ్ చరణ్ శిరీష్ ని విష్ చేసాడు.