మలయాళంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై నేడు కోట్లు కొల్లగొడుతున్న 2018 మూవీ ఇప్పుడు ఇతర భాషల్లోనూ తన ప్రతాపం చూపిస్తుంది. తెలుగులో ప్రమోషన్స్ లేకుండానే బన్నీ వాస్ హడావిడిగా 2018 ని డబ్ చేసి తెలుగులో రిలీజ్ చెయ్యగా.. రోజుకి కోటిన్నర చొప్పున కలెక్షన్స్ కొల్లగొడుతూ వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 160 కోట్లు సాధించిన ఈ సినిమా.. తెలుగులో వీకెండ్ పూర్తయ్యేసరికి 5 కోట్లకుపైగానే వసూళ్ల ప్రభంజనం సృష్టించింది.
2018 వరదల బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ మూవీ ప్రతిఒక్కరికీ కనెక్ట్ అవుతోంది. మే 5న మలయాళంలో విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి ఊపు మీద కలెక్షన్స్ కొల్లగొడుతున్న ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ రెడీ అయిపోయారు. అంతేకాదు విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. జూన్ 7 న సోని లైవ్ నుండి ఓటిటీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
మంచి డీల్ తో ఓటిటీ హక్కులని సొంతం చేసుకున్న సోని లైవ్.. కి థియేటర్స్ దగ్గర బ్లాక్ బస్టర్ అయిన 2018 ని ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా ఓటిటిలోకి తీసుకొస్తే వారికే మంచిది అందుకే ఇలాంటి ప్లాన్ చేశారు.