శ్రద్ద దాస్.. ఈ పేరు టాలీవుడ్ లో వినిపించి చాలాకాలమే అయ్యింది. గ్లామర్ గా అందాలు చూపించినా శ్రద్ద దాస్ కి వర్కౌట్ అవలేదు. అల్లు అర్జున్, గోపీచంద్ లాంటి హీరోలు కూడా శ్రద్ద దాస్ కి లైఫ్ ఇవ్వలేదు. సెకండ్ హీరోయిన్ గా చేసినా ఆమె కెరీర్ కి హెల్ప్ అవ్వలేదు సరికదా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటో షోటోస్ తో హడావిడి చేస్తుంది. అవి ఆమెకి ఏ మాత్రం సినిమా అవకాశాలు తెచ్చిపెట్టలేదు.
కానీ లక్కీగా బుల్లితెర మీద డాన్స్ రియాలిటీ షో ఢీ డాన్స్ షో లో శేఖర్ మాస్టర్ పక్కన జెడ్జ్ ప్లేస్ లో కూర్చుంది. అందాలు ఆరబోసే అవుట్ ఫిట్స్ తో శ్రద్ద దాస్ అద్భుతంగా, అందంగా, ఆకర్షణగా అకనిపించినా ఆమెకి అవకాశం ఇచ్చిన నాధుడు లేడు. ఢీ 15 గ్రాండ్ ఫినాలే లో శ్రద్ద దాస్ గ్లామర్ డోస్ మరింతగా పెంచింది. ఆ షోలో ప్రతి వారం హాఫ్ శారీలో అయినా, శారీలో అయినా శ్రద్ద అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గదేది కాదు.
ఢీ 15 గ్రాండ్ ఫినాలేలో శ్రద్ద గ్లామర్ మోత మోగించేసింది. ఇదే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి క్రేజీ హీరోయిన్ శ్రీలీలే అతిధిగా వచ్చింది. ఇక విధంగా అందాలు చూపిస్తే నీకు అవకాశాలు వస్తాయా శ్రద్దా.. ప్రస్తుతం నువ్వు ఫెడవుడ్ హీరోయిన్ వి, ఇకపై ఎంతగా గ్లామర్ డోస్ పెంచినా ఉపయోగం ఉండదు అని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.